logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలి?

ఎవరైనా వారి జన్మ నక్షత్రం ప్రకారం వీటిని ధరించవచ్చు. చేతి వేళ్ళకు వారి జాతకంలో చెప్పబడిన విధంగా రత్నాలను ధరించడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి, శత్రు నాశనం, అనుకున్న పనుల్లో విజయం సాధించడం లాంటి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ నెలలో జన్మించిన వారికి ఏ రత్నం ధరించడం వల్ల కలిసొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరి నెలలో పుట్టినవారు గోమేధికం ధరించాలి. దీని వలన మనసు ప్రశాంతంగా ఉండి ఆందోళనలు, భయాలు దూరమవుతాయి.

కురువింతను ఫిబ్రవరి లో జన్మించిన వారు ధరిస్తే వీరికి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడతారని పండితులు సూచిస్తున్నారు.

మార్చి నెలలో జన్మించిన వారికి నీలం రత్నం కలిసొస్తుంది. ఆరోగ్యాభివృదితో పాటుగా ఆకస్మిక ప్రమాదాలకు గురి కాకూండా రక్షణనిస్తుంది.

మీరు ఏప్రిల్ నెలలో జన్మించి ఉంటె వజ్రాన్ని ధరించండి. దీని వల్ల మీపైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం లేకుండా చేస్తుంది.

మీ నెలలో పుట్టినవారికి మరకతం చాలామంచిది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

జూన్ నెలలో పుట్టినవారు ముత్యాన్ని ధరించాలి. ఇది స్వచ్ఛతకు, ప్రశాంతతకు గుర్తు. అలాగే ఇది ధరించినవారికి మనశాంతి కలుగుతుంది.

సాధారణంగా జులై నెలలో పుట్టినవారు నిరాశ, నిస్పృహలతో బాధపడతారు. వీరు తప్పనిసరిగా రూబీని ధరించడం వల్ల జీవితంలోకి ప్రేమను తెస్తుందని సూచిస్తున్నారు.

ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయట. వీటి నుంచి బయటపడాలంటే పచ్చను ధరించాలి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టినవారైతే నీలకాంత మణిని ధరించాలి.

అక్టోబర్ లో పుట్టినవారు ఓపాల్ అనే రాయిని ధరించాలి. ఇది అనేక రంగుల కలయికగా ఉంటుంది.ఈ రత్నం వల్ల శాంతి లభిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారికి మంచిది.

నవంబర్ నెలలో పుట్టినవారు పుష్పరాగాన్ని వేలికి తొడగాలి. ఇది సత్సంబంధాలను మెరుగుపరుస్తుంది.

డిసెంబర్ నెలలో జన్మించిన వారు మణిని ధరించాలి. ఆకాశం రంగులో ఉండే ఈ మణిలోకి వెలుగు వెళ్ళలేదు. ఇది ఈ రత్నం ప్రత్యేకత.

Related News