logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

ముంచుకొస్తున్న బ‌ర్డ్‌ఫ్లూ ముప్పు.. ఇప్ప‌టికే నాలుగు రాష్ట్రాల‌కు

ఇప్ప‌టికే ఏడాది కాలంగా క‌రోనాతో అత‌లాకుత‌లం అవుతున్న మ‌నకు మ‌రో ముప్పు ముంచుకొస్తోంది. 2006లో దేశంలో క‌ల‌క‌లం సృష్టించిన బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌రోసారి మ‌న దేశంలో వ్యాపించ‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మొద‌ట రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్‌ను గుర్తించ‌గా తాజాగా కేర‌ళ‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కఈ వైర‌స్ ప్ర‌భావాన్ని అధికారులు గుర్తించారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రా జిల్లాలోని పాంగ్ డ్యామ్ లేక్‌లో వ‌ల‌స బాతులు మొద‌ట బ‌ర్డ్‌ఫ్లూ బారిన ప‌డిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ వైర‌స్ కార‌ణంగానే సుమారు 1800 బాతులు మృత్యువాత ప‌డ్డాయి. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున వ‌ల‌స ప‌క్షులు మ‌ర‌ణించ‌డంతో ఆందోళ‌న చెందిన అధికారులు మ‌ర‌ణించిన ప‌క్షుల నుంచి న‌మూనాలు సేక‌రించి బఇండియ‌న్ వెట‌ర్న‌రీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా వీటికి బ‌ర్డ్‌ఫ్లూ సోకింద‌ని తేలింది.

ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లోనూ 400 వ‌ర‌కు కాకులు మ‌ర‌ణించాయి. ఇవి కూడా బ‌ర్డ్‌ఫ్లూ వ‌ల్లనే మ‌ర‌ణించాయ‌ని తేలింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇండోర్ ఈ వైర‌స్ కార‌ణంగా కొన్ని కాకులు మ‌ర‌ణించ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేర‌ళ‌లోని కొట్టాయం, అల‌ప్పీ ప్రాంతాల్లోనూ బ‌ర్డ్‌ఫ్లూ వ‌ల్ల కొన్ని ప‌క్షులు మ‌ర‌ణించాయి.

బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్ ప‌క్షుల నుంచి మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే కేర‌ళ‌లో వైర‌స్ మ‌రింత వ్యాపించ‌కుండా నివారించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. బ‌ర్డ్‌ఫ్లూ ప్ర‌బ‌లిన ప్రాంతంలో వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉందని భావిస్తున్న సుమారు 40 వేల కోళ్లు, బాతుల‌ను చంపేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు.

2006లో మ‌న దేశంలో బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్ ప్ర‌బ‌లింది. ఆ స‌మ‌యంలో దేశంలో పెద్ద ఎత్తున కోళ్లు, ప‌క్షులు ఈ వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణించాయి. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాధి మంది ఆధార‌ప‌డిన పౌల్ట్రీ ఇండ‌స్ట్రీకి అప్ప‌ట్లో భారీ న‌ష్టం జ‌రిగింది. 2006 ఫిబ్ర‌వ‌రి 19న మ‌హారాష్ట్ర‌ నందూర్‌బార్ జిల్లాలోని న‌వ‌పూర్ గ్రామంలో బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్‌ను గుర్తించారు. అప్ప‌ట్లో వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం ఐదు రోజుల్లో రెండున్న‌ర ల‌క్ష‌ల ప‌క్షులు, కోళ్ల‌న చంపేసింది.

ఇప్పుడు మ‌రోసారి ఈ వైర‌స్ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి వ్యాపించ‌డంతో అంద‌రిలోనూ ఆందోళ‌న మొద‌లైంది. ముఖ్యంగా కోళ్ల ఫార‌మ్ యాజ‌మానులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నాలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆదేశించాయి. ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాపించిన నాలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు వైర‌స్‌ను నివారించేందుకు యుద్ధ‌ప్రాతిపాదిక‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

Related News