logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బిల్ గేట్స్, ఒబామా, ఎలాన్ మస్క్ లకు భారీ షాక్.. ప్రపంచంలోనే తొలిసారి!

ప్రపంచంలోనే తొలిసారిగా ముందెన్నడూ లేని విధంగా ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఒకరి కాదు ఇద్దరు కాదు.. ఎలన్ మస్క్, జెఫ్ బీజోస్, బిల్ గేట్స్ లాంటి బిలియనీర్ల ఖాతాలతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జోసెఫ్ బెడెన్, కేయిన్ వెస్ట్ వంటి ప్రముఖుల ట్విట్టర్ ఎకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి. ట్విట్టర్ చరిత్రలో ఇలాంటి భారీ హ్యాక్ ఇదే తొలిసారి అని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.

బిట్‌కాయిన్‌ స్కామ్‌లో భాగంగా ఈ హ్యాకింగ్స్ జరిగినట్టు భావిస్తున్నారు. వీరందరి అకౌంట్ల నుంచి అనుమానాస్పద రీతిలో క్రిప్టోకరెన్సీ రూపంలో డోనేషన్లు కావాలంటూ రిక్వెస్టులు వచ్చాయి. ‘మీరు నాకు వెయ్యి డాలర్లు పంపిస్తే నేను మీకు రెండు వేల డాలర్లు పంపిస్తా’ అని పోస్ట్ చేశారు హ్యాకర్లు. ఈ ట్వీట్లు నిజమని నమ్మిన వారు భారీగా విరాళాలు అందించారని తెలుస్తుంది.

ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయినట్టు గుర్తించిన ట్విట్టర్ వెంటనే భారీ భద్రతా చర్యలను చేపట్టింది. బ్లూటిక్‌ ఉన్న వెరిఫైడ్‌ ఎకౌంట్‌ల నుంచి వస్తున్న అనేక ట్వీట్‌లను నిలిపివేసింది. పాస్‌వర్డ్ రీసెట్ రిక్వెస్ట్‌లను ట్విటర్‌ నిలిపివేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం అకౌంట్లన్నీ యథావిథిగా పని చేస్తున్నాయని, సమస్యను గుర్తించే పనిలో ఉన్నామని ట్విట్టర్ పేర్కొంది.

Related News