బుల్లితెర ప్రేక్షకులకు మరో వినోదం నేటి నుంచే ప్రారంభం కాబోతోంది. స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ఇవాళ సాయంత్రం మొదలుకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ 14 రోజుల కరోనా క్వారంటైన్ పూర్తి చేసుకొని 3వ తేదీనే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా ఈ షోను నిర్వహించనున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో ఎప్పుడూ షో నిర్వహాకులు సస్పెన్స్ మెయిన్టైన్ చేస్తుంటారు. అయితే, వివిధ రూపాల్లో కంటెస్టెంట్ల పేర్లు బయటకు వస్తూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు కరెక్ట్ అవుతాయి. ఈసారి కూడా షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితా బయటకు వచ్చింది. 15 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు సందడి చేయనున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..?
హారిక (దెత్తడి యూట్యూబ్ ఛానల్ నటి)
దేవి నాగవల్లి (టీవీ9 న్యూస్ రీడర్)
గంగవ్వ (మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నటి)
ముక్కు అవినాష్ (జబర్దస్త్ ఫేం)
మోనాల్ గుజ్జార్ (హీరోయిన్)
అమ్మ రాజశేఖర్( సినీ దర్శకుడు)
కరాటే కళ్యాణి (సినీ నటి)
నోయల్(సింగర్)
సూర్యకిరణ్ (సినీ దర్శకుడు)
లాస్య (టీవీ యాంకర్)
జోర్దార్ సుజాత (న్యూస్ రీడర్)
తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం సీరియల్ ఫేం)
సయ్యద్ సోహైల్ (సీరియల్ నటుడు)
అరియానా గ్లోరీ (జెమినిటీవీ కెవ్వు కామెడీ షో యాంకర్)
అభిజిత్ (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా హీరో)
సురేఖ(సినీ నటి)