logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే

తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ సీజ‌న్ నిర్వ‌హించేందుకు గానూ ఇప్ప‌టికే సెట్ నిర్మాణం కూడా పూర్త‌య్యింది. కంటెస్టెంట్ల లిస్ట్ కూడా స్టార్ మా నిర్వాహ‌కులు ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. గ్లామ‌ర్ డోస్ ఉండేలా చూసుకుంటూ సోష‌ల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న వారిని ఈసారి కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించ‌నున్నార‌ని స‌మాచారం.

ఈసారి బిగ్ బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్టులో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ ఆర్టిస్ట్‌ గెటప్ శ్రీను, రఘు మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యంకర్ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్ న‌టి నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమ కావాలి హీరోయిన్ ఈషా చావ్లా, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు ఈసారి బిగ్ బాస్ ఫైన‌ల్ లిస్టులో ఉన్నార‌ని తెలుస్తోంది.

దాదాపుగా ఇదే లిస్టు ఫైన‌ల్ అవుతుంద‌ని, ఒక‌టి రెండు పేర్లు మారితే మారొచ్చ‌ని స‌మాచారం. నాలుగో సీజ‌న్‌లో ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వారినే బిగ్ బాస్‌లోకి తెచ్చారు. మామూలు ప్ర‌జ‌ల‌కు కూడా తెలిసిన వారు ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో ప్రేక్షకులు కొంత పెద‌వి విరిచారు. దీంతో ఈసారి ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసిన మొఖాల‌నే తీసుకువ‌చ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాగా, బిగ్ బాస్ ఐదో సీజ‌న్ సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి ప్రారంభించాల‌ని స్టార్ మా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ కూడా కొంత‌వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా షోను అనుకున్న స‌మ‌యానికే ప్రారంభిస్తామ‌ని నిర్వాహ‌కులు న‌మ్మ‌కంగా ఉన్నారు. అయితే, షో కంటెస్టెంట్స్‌ను ముందుగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్ట‌నున్నారు. గ‌త రెండు సీజ‌న్స్‌ను హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున కాకుండా ఈ సారి కొత్త వారు బిగ్ బాస్ హోస్ట్‌గా క‌నిపిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

Related News