logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్ లోకి యాంకర్ సుమ!

అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీ రాబోతుంది. ఈ సీజన్ లో ఎంపిక చేసుకున్న కంటెస్టెంట్లలో అంతా కొత్త వారు కావడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారనే కామెంట్లు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పటికప్పుడు షోను బోర్ కొట్టించకుండా ఉండేందుకు బిగ్ బాస్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫన్నీ టాస్కులు, సెలబ్రిటీల ఎంట్రీలు ప్లాన్ చేస్తూ టీఆర్పీ రేటింగ్లు పెంచుకునే పనిలో పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఆరవ వారంలో మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ కూడా అయ్యాడు.

ఆ తర్వాత ముక్కు అవినాష్ రాగా ప్రస్తుతం హౌస్లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. ఇక మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన స్వాతి దీక్షిత్ వచ్చిన పది రోజులకే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వైల్డ్ కార్డు ఎంట్రీ గా యాంకర్ సుమ కనకాలను రంగంలోకి దింపుతున్నట్టుగా బిగ్ బాస్ ఒక ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది. సుమకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే.

ఆమె ఒక్కసారి మైక్ పట్టుకుంటే ఆ హుషారు మాములుగా ఉండదు. ఇంతటి ముల్టీటాలెంటెడ్ అయిన సుమ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే ఇక ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండదు. అదే విషయాన్ని నాగార్జున కూడా చెప్తూ ఇక మిగిలిన ఐదు వారాలు హౌస్ లో సందడి మొదలవ్వనుందంటున్నారు. సుమ స్టేజ్ పైకి రావడంతోనే ఇంటి సభ్యులపై పంచులతో చెలరేగిపోయింది. అటు నాగార్జునను కూడా ఓ ఆటాడుకుంది. ఇక సుమ ఎంట్రీతో మున్ముందు ఈ షో రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనవసరం లేదు. అయితే ఈ వార్త నమ్మడం ప్రేక్షకులకు కాస్త కష్టంగానే ఉంటుంది.

ఎందుకంటే తెలుగు తెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమకు ఇప్పటికిప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టి పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫంక్షన్లు, ఇతర షోలు చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తుంది. ఆమెకు ప్రైజ్ మనీ గెలవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ ప్రోమోపై నెటిజన్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఇది బిగ్ బాస్ టీమ్ పబ్లిసిటీ స్టంట్ అయ్యుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Related News