logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రేవంత్ రెడ్డికి బిగ్ షాక్‌.. బీజేపీలోకి కీల‌క నేత‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌త్యేకించి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌, కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశ్రైలం గౌడ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వ‌ర‌లో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌నున్నారు. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌. 2009లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ హ‌యాంలో కాంగ్రెస్‌లో చేరారు.

ప్ర‌స్తుతం మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్‌గిరి డీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఆయ‌న స‌న్నిహితుడిగా కొన‌సాగుతున్నారు. పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి స‌న్నిహితుడే దూర‌మ‌వ‌డం ఎదురుదెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. ఇటీవ‌ల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా రేవంత్ రెడ్డి వ‌ర్గీయులుగా, ఆయ‌న అనుచ‌రులుగా ముద్ర‌ప‌డిన కొంద‌రు నేత‌లు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

ఏడేళ్లుగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడ‌టంలో కాంగ్రెస్ పార్టీ విఫ‌ల‌మైంద‌ని, ఇందుకు దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలే ఉదాహ‌ర‌ణ అని శ్రీశైలం గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేక‌పోయింద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడ‌టం బీజేపీకే సాధ్య‌మ‌ని, తాను బీజేపీలో చేర‌బోతున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

Related News