logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏపీలో అడుగుపెట్టిన చంద్ర‌బాబుకు రెండో రోజే బిగ్ షాక్..!

రెండు నెల‌ల పాటు హైద‌రాబాద్‌లో ఉండి నిన్న‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు భారీ షాక్ త‌గ‌ల‌నుంది. ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు, గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు వారు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌ల‌వ‌బోతున్నారు.

ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆయ‌న ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా దెబ్బ‌తిన్న తెలుగుదేశం పార్టీకి ప్ర‌కాశం జిల్లా కొంత ఊర‌ట‌నిచ్చింది. ఈ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్ల‌లో 4 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఈ న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం టీడీపీని వీడి జ‌గ‌న్‌ను క‌లిశారు. ఇప్పుడు ప‌ర్చూరు ఎమ్మెల్యే కూడా టీడీపీని వీడేందుకు సిద్ధం కావ‌డంతో ఆ పార్టీకి జిల్లాలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది.

గుంటూరు జిల్లాలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే విజ‌యం సాధించింది. వీరిలో ఇప్ప‌టికే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి వైసీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌గా టీడీపీకి మిగిలిన మ‌రో ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కూడా వైసీపీకి జై కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ ప్ర‌తీయేటా ఘ‌నంగా నిర్వ‌హించే మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఈ గురు, శుక్ర‌వారాల్లో నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టింది.

క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్ కార‌ణంగా టెక్నాల‌జిని ఉపయోగించుకొని జూమ్ యాప్ ద్వారా మ‌హానాడు నిర్వ‌హించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి మ‌హానాడుకు ముందే గ‌ట్టి దెబ్బ కొట్టాల‌నే వ్యూహంతో వైసీపీ ముందుకెళుతోంది. మ‌రికొంద‌రు టీడీపీ నేత‌ల‌తోనూ వైసీపీ ట‌చ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Related News