logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ఎమ్మెల్యే రాజాసింగ్ కు హై కోర్టులో భారీ ఊరట!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసుపై హై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కాగా 2016 లో ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ చేసుకొబోతున్నారనే వార్తలపై రాజా సింగ్ చాలా తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ చేసుకున్నట్లయితే నా తడాఖా చూపిస్తాను. దాద్రీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా చూడవలసి వస్తుంది. అని హెచ్చరించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసారు. సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తు నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.

Related News