logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే..

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏకైక రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’. ‘స్టార్‌‌‌‌ మా’ ఛానెల్‌ లో ప్రసారమయ్యే ఈ షో మొదట అంచనాలు లేకుండా వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఛానెల్ రేటింగులను అమాంతం పెంచేసింది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టబోతుంది బిగ్ బాస్. సీజన్ త్రీ హోస్ట్ చేసిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున నాలుగో సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సందడి మొదలైంది. కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో బిగ్‌ బాస్‌ షో ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి.

కానీ ఆ అనుమానాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ బిగ్ బాస్‌ 4 షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా నాగార్జున ప్రోమో విడుదల చేసారు. 16 మంది సెలబ్రిటీలతో 15 వారాల పాటు ఈ షో ఆసక్తికరంగా సాగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇందులో పాల్గొన బోతున్న సెలబ్రిటీలు ఎవరనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపించిన పేరు బిత్తిరి సత్తి. టీవీ 9 ఛానెల్ లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ షో నుంచి బిత్తిరి సత్తి తప్పుకోవడంతో బిగ్ బాస్ లో పాల్గొంటాడనే ప్రచారం జరిగింది.

అయితే సత్తి సాక్షి ఛానెల్ లో చేరడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టులే అయినా క్రేజ్ విషయంలో హీరోయిన్ల తో పడుతుంటారు కొందరు నటీమణులు. అలాంటివారిలో ప్రగతి, సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ప్రగతి ఈ వార్తలపై స్పందిస్తూ అవన్నీ వట్టి రూమర్లే అని క్లారిటీ ఇచ్చేసింది. అలాగే టాలీవుడ్ హీరో తరుణ్ కూడా బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయబోనని చెప్పేసాడు.

మిగిలిన వారిలో బాగా వైరల్ అవుతున్న పేర్లలో గ్లామరస్ టీవీ యాంకర్లుగా పేరున్న రష్మీ గౌతమ్, వర్షిణి సౌందర్ రాజన్ ఉన్నారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు వరుస షోలతో బిజీగా ఉన్నారు. మరి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలంటే కచ్చితంగా 4 నెలలు కేటాయించాల్సి ఉంటుంది. అన్ని రోజుల పాటు బిగ్ బాస్ లో పాల్గొనడం అంటే వీరికి కొంచెం రిస్కుతో కూడుకున్న విషయమే. మరి బిగ్ బాస్ లో ఈ యాంకర్లు ఉంటారో లేదో వేచి చూడాలి. రిపోర్టర్ గా కెరీర్ మొదలు పెట్టి సింగర్ గా ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ పేరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ప్రధానంగా వినిపిస్తుంది.

ఆమె కూడా షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. ఇక గత షోలో సింగర్ గీత మాధురి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇపుడు గీత మాధురి భర్త, టాలీవుడ్ యంగ్ హీరో నందు ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉంది. జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మూడో సీజన్ నుంచే సుధీర్ బిగ్ బాస్ లోకి వెళ్తాడనే రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు నిజంగానే హౌస్ లోకి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ స్టార్‌ యాంకర్‌ ఝాన్సీ కూడా కంటెస్ట్‌ల లిస్ట్‌లో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

స్టార్ సింగర్‌ సునీత కూడా ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కమెడియన్‌ తాగుబోతు రమేష్, యూట్యూబ్‌ స్టార్స్ వైవా హర్ష, మహాతల్లి పేర్లు కూడా వార్తల్లో ఉన్నాయి. హుషారు సినిమాతో గుర్తింపు పొందిన టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రియా వడ్లమాని పేరు కూడా బిగ్ బాస్ లిస్టులో ఉన్నట్టుగా వైరల్ అవుతుంది. అయితే బిగ్ బాస్ షో లో పాల్గొనడం లేదని కొందరు క్లారిటీ ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ మరి కొందరు సెలబ్రిటీలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. కానీ ఈ లిస్టులో ఉన్న పేర్లు అధికారికం కావని బిగ్ బాస్ నిర్వాహకులు అంటున్నారు. కంటెస్టెంట్లు ఎవరనే విషయం షో ప్రారంభం అయ్యే రోజే తెలుసుకోవాలంటున్నారు.

Related News