logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బిగ్ బాస్ సీజన్ -4 అందగత్తెలు వీరే.. తెలుగమ్మాయిలదే హవా!

తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కి రంగం సిద్ధమైంది. మొదటి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు నాలుగో సీజన్ ను మరింత రక్తి కట్టించే విధంగా తయారు చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అయితే ఈసారి షోకి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. సీజన్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్, సీజన్ టూ లో న్యాచురల్ స్టార్ నాని, త్రి లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా అదరగొట్టేసారు.

అయితే సీజన్ 4 కి కొంత ప్రత్యేకత ఉండాలని భావించిన యాజమాన్యం ఈసారి రేణు దేశాయ్ ను రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ అంటూ అంటూ ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈసారి కూడా నాగార్జునానే షోను హోస్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే సీజన్ 4 లో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడానికి యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

అయితే ఎప్పటిలాగే బిగ్ బాస్ కు లీకుల బెడద తప్పడంలేదు. గత సీజన్ లో కూడా విన్నర్ ను ముందుగానే లీక్ చేసి బిగ్ బాస్ కు భారీ షాకిచ్చారు ఈ లీకు రాయుళ్లు. ఇప్పటికే బిగ్ బాస్ లో అర డజనుకు పైగా కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. లీకైన వివరాల ప్రకారం ఈ షోలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్ల లిస్టు చూసి కళ్ళు తేలేస్తున్నారు అభిమానులు.

కంటెస్టెంట్ల లో ముంబై ముద్దుగుమ్మ శ్రద్ధ దాస్ ఒకరైతే, టాప్ మోడల్ గా పేరు తెచ్చుకున్న నటి హంసా నందిని ఉన్నారు. ఈ సీజన్ లో ప్రత్యేకించి తెలుగమ్మాయిలదే హవా అన్నట్టు కనిపిస్తుంది. లీకైన నలుగురి పేర్లలో ఇద్దరు మన తెలుగు బ్యూటీలే ఉన్నారు. అందులో ఒకరు బోల్డ్ సినిమాలతో యూత్ హార్ట్ బీట్ పెంచేసిన యామిని భాస్కర్ కాగా.. మరొకరు హుషారు సినిమాతో ఆకట్టుకున్న ప్రియా వడ్లమాని.

మోనా అనే మరో నటి పేరు కూడా వినిపిస్తుంది. ఇలా అందరికి అందరూ బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న వారే కావడం విశేషం. దీనిని బట్టి ఈసారి బిగ్ బాస్ లో గ్లామర్ డోస్ ను భారీగా పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఇక వినోదానికి కూడా ఏమాత్రం కొదువ లేకుండా ఇప్పటికే బిత్తిరి సత్తి బిగ్ బాస్ లో పాల్గొంటున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Related News