logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

సోహైల్ పని అయిపోయినట్టేనా?.. మోనాల్ కు బిగ్ బాస్ సపోర్ట్… లాస్యకు ఆడియెన్స్ షాక్!

బిగ్ బాస్ రియాలిటి షో ముగింపు దశకు చేరుకుంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య విపరీతమైన పోటీ పెరుగుతుంది. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య మాట మాటా పెరిగి పెద్ద వివాదానికి దారి తీసింది. చివరకు ఒకరినొకరు కొట్టుకుంటారేమోనన్న అనుమానం కలిగింది ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు. ఇప్పటివరకు హౌస్ లో కోపిష్టిగా పేరున్న సోహైల్ ఆ తర్వాత తన తీరు మార్చుకుంటూ అందరితో సరదాగా ఉంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగాడు. కానీ నిన్నటి ఒక్క ఎపిసోడ్ తో ఇపటివరకు తెచ్చుకున్న ఫెమ్ అంతా గాల్లో కలిపేసుకున్నాడు సోహైల్.

లేడీ కంటెస్టెంట్ అని కూడా చూడకుండా హారికతో సోహైల్ ప్రవర్తించిన తీరుతో ప్రేక్షకుల్లో ఉన్న పేరు మొత్తం చెడగొట్టుకున్నాడు. సోహైల్, అభిజిత్, హరికల మధ్య మాటల యుద్ధం జరిగింది. హారిక కూడా తన స్టైల్ లో గట్టిగానే సమాధానం ఇవ్వడంతో సోహైల్ ఇమేజ్ ను మరింత డ్యామేజీ చేసినట్లయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే గతవారం మెహబూబ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పటికే దీనిపై లీకులు కూడా అందుతున్నాయి.

ఈ వారం అఖిల్, అవినాష్ తప్ప మిగిలిన అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే ఈ వారం లాస్య ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నటు కనిపిస్తుంది. ఎందుకంటే 8.82శాతం ఓట్లతో లాస్య అందరికంటే చివరి స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి హౌస్ లో మరో వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే మోనాల్ పేరే వినిపిస్తుంది. కానీ ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా బిగ్ బాస్ నిర్వాహకులు ఎప్పటిలాగానే మోనాల్ ను కాపాడే ప్రయత్నం చేస్తారని, మరోవైపు మోనాల్ కు హోస్ట్ నాగార్జున ఫుల్ సపోర్ట్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మరో విషయం ఏమిటంటే ఇప్పుడు ఎలాగో అఖిల్ సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి అతని ఓట్లన్నీ మోనాల్ కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆమె ఈ వారం కూడా హౌస్ లో కొనసాగవచ్చు. కానీ ఈ మధ్య వీక్ కంటెస్టెంట్ గా మారిన లాస్య.. ఒకవేళ ఈ ఐదు రోజుల్లో తన గేమ్ ను చేంజ్ చేసుకుంటే మాత్రం సీన్ రివర్స్ అవ్వచ్చు. ఆమెను సేవ్ చేయడానికి ఆమె తరపున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్లయిన హారిక, ఆరియానా, అభిజిత్, సోహైల్ లు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ తాజా ఎపిసోడ్ ప్రభావం సోహైల్ ను హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేస్తుందా లేక ప్రేక్షకులు మరో ఛాన్స్ ఇస్తారా అనే విషయం వేచి చూడాలి.

Related News