బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ -4 13 వారానికి చేరుకుంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనే విషయం ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ వారం నామినేషన్ లో అఖిల్, మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్ ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఎవిక్షన్ పాస్ తో ఎలిమినేట్ కాకుండా సేవ్ అయిన అవినాష్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకోలేడని అంటున్నారు.
జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్ బిగ్ బాస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట ప్రేక్షకులను తన మార్కు ఎంటర్ టైన్మెంట్ తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ రాను రాను బిగ్ బాస్ హౌస్ లో సింపథీ సంపాదించుకునే ప్రయత్నం చేసాడని అతనిపై కామెంట్లు వినిపించాయి.
అతని సన్నిహితులు సైతం ఈ ఒక్కటి తనలో మార్చుకుంటే ఫైనల్ కంటెస్టెంట్ల లిస్టులో అవినాష్ తప్పక ఉంటాడని చెప్తున్నారు. కానీ డిసెంబర్ 20 న గ్రాండ్ ఫినాలే ఉండనుందని సమాచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ లో టఫ్ గేమ్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు నామినేషన్ ఉన్న వారిలో అవినాషే ఎలిమినేట్ అవుతాడని బిగ్ బాస్ ప్రేక్షకులు జోస్యం చెప్తున్నారు.