logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ప్రతి నెలా డబ్బు కావాలా? ఈ ఎస్బీఐ స్కీంలో చేరండి!

దేశీ అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అనేక సేవలను అందిస్తుంది. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) అకౌంట్ సర్వీసు ఒకటి. 1968 లో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు. ఈ స్కీంలో నెలకు రూ. వెయ్యి డిపాజిట్ చేసిన వారికి మెచ్యూరిటీ సమయంలో రూ. 3 లక్షలకు పైగా లభిస్తాయి. అదే నెలకు రూ. 3 వేలు కడితే దాదాపు రూ. 10 లక్షలు వస్తాయి. అదే నెలకు రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ. 32 లక్షలు వస్తాయి. మరి ఈ స్కీం లో చేరాలంటే కనీస డిపాజిట్ ఎంత చెల్లించాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? వడ్డీ ఎంత లభిస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ స్కీంలో చేరడానికి ఎస్బీఐ బ్యాంకుకు నేరుగా వెళ్లి అకౌంట్ తెరవచ్చు. లేదంటే పోస్టాఫీసు ద్వారా కూడా తెరవచ్చు. ఈ అకౌంట్ ను ఎవరైనా సులభంగా తెరవచ్చు. ఎలాంటి రూల్స్ లేవు. సొంతంగా లేక పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెరవచ్చు. పిపిఎఫ్ సేవింగ్స్ స్కీం లో చేరడం వల్ల ముఖ్యంగా మూడు లాభాలు ఉన్నాయి. ఒకటి మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా అధిక వడ్డీ కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ స్కీంలో చేరిన వారికి టాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి.

ఈ స్కీం కాల వ్యవధి 15 ఏండ్లు. ఆ తర్వాత ఐదేళ్ల చొప్పున గడువును పొడిగించుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేయాలనుకునే వారు రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు.ఆదాయపు పన్ను చట్టం నిబంధనల మేరకు రూ. లక్షా యాభై వేల కన్నా ఎక్కువగా డిపాజిట్ చేయడానికి వీలులేదు. ఈ డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. లేదా ఏడాదికి 12 వాయిదాలలో డిపాజిట్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీం లో వార్షిక వడ్డీ రేటును 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు.

ఇందులో లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. అయితే మీ వయసు, అకౌంట్ బ్యాలెన్స్ పై అది ఆధారపడి ఉంటుంది. లేదంటే కాలపరిమితి ముగిసిన తర్వాత మీ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 88 ప్రకారం పన్ను లాభాలు ఉంటాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీ పై పన్నుతో పాటుగా వెల్త్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు ఉంటాయి. మీ పేరు మీద అకౌంట్ ఉంటె మీరు నామినీలను కూడా ఎంచుకోవచ్చు. వారికి ఎంత వాటా వెళ్లాలో ముందుగానే వివరించాల్సి ఉంటుంది.

Related News