logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

భీష్మ ఏకాదశి రోజున అస్సలు చేయకూడని పనులు ఇవే!

మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణు మూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. అలాగే ఈరోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. భీష్మ ఏకాదశి రోజున మనసుతో పాటుగా ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇతరులకు హాని తలపెట్టే ఆలోచనలు గాని, పనులు గాని చేయకూడదు. వీలైనంత తక్కువగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు పరుషపదజాలం ఉపయోగించకూడదు.

వెలుల్లి, ఉల్లిపాయలను తీసుకోకూడదు. శాకాహారం మాత్రమే తినాలి. ఈ రోజున ఉపవాసం చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. ద్వాద శివరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజున చీమలు, పురుగులు వంటివి నశిస్తే మీరు పాపం చేసిన వారుగా పరిగణించబడతారు. ఏ జంతువుకు హాని తలపెట్టకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.

సూర్యాస్తమయం వరకు నిద్ర పోకూడదు. కొంత మంది ఈరోజున జాగారం కూడా చేస్తారు. భీష్మ ఏకాదశి రోజున భగవద్గీత పాటించడం వలన విషుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజున ఎవరైనా విష్ణు సహస్ర నామాలను పఠిస్తే సంవత్సరమంతా ఈ నామాలను పఠించినంత పుణ్య ఫలం దక్కుతుందని భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. పేదవారికి దానధర్మాలు ఇవ్వడం వలన దోషాలు తొలగిపోతాయి. అన్నింటా విజయం సాధిస్తారు.

 

Related News