logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

వైసీపీ నేత హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ

మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మెన్, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో సంచలన నిజాలను వెల్లడించారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలే భాస్కరరావు హత్యకు దారితీశాయన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాంచారయ్యకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండ ఉందన్నారు. భాస్కరరావు హత్యకు 15 రోజుల ముందుగానే పథకం వేశారని తెలిపారు.

నిందితుడు నాంచారయ్యను రహస్యంగా కలిసిన కొల్లు రవీంద్ర గంట పాటు అతనితో సమావేశమయ్యారు. తాను భాస్కరరావు హత్య చేయబోతున్న విషయం కొల్లు రవీంద్రకు చెబితే.. తన పేరు బయటకు రాకుండా పథకం వేయాలని రవీంద్ర సూచించాడు. ఈ సమావేశానికి రవీంద్ర తన పీఏ తో పాటుగా వచ్చాడు. నాలుగు రోజుల పాటు రెక్కీ నిర్వహించి భాస్కరరావు మార్కెట్ యార్డుకు ఒంటరిగా వెళ్తున్న విషయం గుర్తించారు. హత్య ఎలా చేయాలో నిందితులకు ట్రైనింగ్ ఇచ్చారు.

భాస్కరరావుపై దాడి చేసిన అనంతరం ముందుగా సిద్ధంగా ఉంచిన బైకుపై నిందితులు పరారయ్యారు. పూర్తి కాల్ డేటా, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే రవీంద్రను అరెస్టు చేయడానికి వెళితే ఆయన తప్పించుకుని పరారయ్యాడు. దీంతో తుని పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు అని మేయకు వివరించారు. 2013 లో కూడా భాస్కరరావు పై హత్యా ప్రయత్న జరిగిందన్నారు.

Related News