logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌

క‌రోనా వైర‌స్ ఇంకా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లంద‌రి ఆశ‌లు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. వివిధ దేశాల్లో మొత్తం సుమారు 200కు పైగా ప‌రిశోధ‌నా సంస్థ‌లు క‌రోనాకు వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి. వీటిల్లో కొన్ని చివ‌రి ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స్టేజ్‌లో ఉన్నాయి. మ‌న దేశంలో హైద‌రాబాద్ కేంద్రంగా ప‌ని చేసే భార‌త్ బ‌యోటెక్ త‌యారుచేస్తున్న క‌రోనా వ్యాక్సిన్‌పైన ఎక్కువ ఆశ‌లు ఉన్నాయి.

కోవాక్సిన్ పేరుతో ఈ సంస్థ క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్ర‌స్తుతం ఈ వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. అంద‌రి చూపు ఈ వ్యాక్సిన్‌పై ఉన్న నేప‌థ్యంలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ వ్యాక్సిన్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఏడాది జూన్‌లో తాము అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ను విడుద‌ల చేస్తామ‌ని ఈ సంస్థ ప్ర‌క‌టించింది.

అంతేకాదు, అత్య‌వ‌స‌రంగా వినియోగించుకోవ‌డానికి భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తే డిసెంబ‌ర్ నాటికే వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తెస్తామ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం భార‌త్ బ‌యోటెక్ కోవాక్సిన్ రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే నెల‌లో మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభం కానున్నాయి. ఒకేసారి ఏకంగా 26 వేల మంది వాలంటీర్ల‌పైన మూడో ద‌శ‌లో భాగంగా కోవాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌ప‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా 30 చోట్ల ఈ ప్రయోగాలు జ‌ర‌పాల‌ని సంస్థ భావిస్తోంది.

మూడో ద‌శ ప్ర‌యోగాల కోసం సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చింది. మొద‌టి, రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఆశాజ‌నకంగా వ్యాక్సిన్ ఫ‌లితాలు ఉన్నందున మూడో ద‌శ ప్ర‌యోగాల‌కు అనుమ‌తించింది. మూడో ద‌శ ప్ర‌యోగాలు కూడా విజ‌య‌వంతంగా పూర్తైన త‌ర్వాత కేంద్రం వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి ఇస్తే వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌తో భార‌త్ బ‌యోటెక్ ఉంది.

పెద్ద ఎత్తున డోసుల‌ను త‌యారుచేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది కాబ‌ట్టి ఈ సంస్థ ప్ర‌త్యేకంగా ఒక ప్లాంట్‌ను కూడా నిర్మిస్తోంది. ఏడాదికి 100 కోట్ల డోసులు ఉత్ప‌త్తి చేయాల‌ని ఈ సంస్థ భావిస్తోంది. మొత్తంగా జూన్ నుంచి ప్ర‌జ‌ల‌కు భార‌త్ బ‌యోటెక్ కోవాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అత్య‌వ‌స‌రం అనుకుంటే కేంద్రం ముందే అనుమ‌తులు కూడా ఇవ్వ‌వ‌చ్చు.

ర‌ష్యా, చైనా కూడా త‌మ దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ల మూడో ద‌శ పూర్తి కాక‌ముందే అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ఇచ్చుకున్నాయి. మ‌రోవైపు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనికా క‌లిసి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా పూణేలోని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉత్స‌త్తి అవుతుంది. ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ కూడా జ‌రుగుతున్నాయి. ఇది కూడా మార్చిలోగా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Related News