logo

  BREAKING NEWS

టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |  

ఒండ్రుమ‌ట్టి లేదా త‌డిగుడ్డ‌తో ఇలా చేస్తే కీళ్ళనొప్పులు మాయం

కీళ్ళ నొప్పులు ఒక‌ప్పుడు 60 ఏళ్ల వ‌య‌స్సు దాటిన వారికి మాత్ర‌మే ఉండే స‌మ‌స్య‌. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. 40 ఏళ్లు పైబ‌డిన వారు కూడా కీళ్ళ నొప్పుల బాధ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్ర‌ధానంగా కీళ్ళ‌సందులో జిగురు త‌గ్గిపోయింద‌నే కార‌ణం చెబుతుంటారు. అయితే, మాన‌వ శ‌రీరం వందేళ్లు స‌మృద్ధిగా జీవించేందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాణ‌మై ఉంటుంది. అటువంటిది 40 ఏళ్లకే ఎందుకు ఈ స‌మ‌స్య వస్తుంద‌నేది మ‌నం ఆలోచించుకోవాలి. మ‌న‌లానే వందేళ్ల ఆయుష్షు ఉన్న ఏ జంతువుల‌కు కీళ్ళ నొప్పులు ఉండ‌వు. కేవ‌లం మాన‌వుల‌కు మాత్ర‌మే కీళ్ళ నొప్పులు వ‌స్తాయి.

ప్ర‌కృతిసిద్ధ ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల‌ జంతువుల‌కు కీళ్ళ నొప్పులు రావు. మ‌నం తీసుకునేదంతా ఉడికించిన ఆహారం. ఉడికించిన ఆహారంలో కీళ్ళ జిగురు తయార‌‌య్యే గుణం, కీళ్ళ అరుగుద‌ల‌ను నివారించే గుణం ఉండ‌దు. అంతేకాదు, ఉప్పును ఎక్కువ‌గా వాడ‌టం కీళ్ళ‌కు అతిపెద్ద ముప్పు. మ‌నం ఎక్కువ‌గా తింటున్న ఉప్పు కీళ్ళ సందుల్లో పేరుకొని కీళ్ళ‌ను తిన‌డం, కార్టిలేజ్‌ను పాడుచేయ‌డం చేస్తుంది. కాబ‌ట్టి ఉప్పు తిన‌డం త‌క్కువ చేయ‌కుండా కీళ్ళ నొప్పులు త‌గ్గించుకోవ‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వృథానే.

కీళ్ళ నొప్పులు త‌గ్గించుకునేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాల‌ను పాటిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ప్ర‌తి రోజూ ఉదయం కాఫీ తాగ‌డం మానేసి ప‌చ్చికూర‌ల‌తో త‌యారు చేసుకున్న జ్యూస్ తాగాలి. ఇందులో ఉండే స‌హ‌జ ల‌వ‌ణాల వ‌ల్ల కీళ్ళ మ‌ధ్య జిగురు మ‌ళ్లీ త‌యార‌వుతుంది. ప్ర‌తి రోజూ ఉద‌యం టిఫిన్ బ‌దులు మొల‌కెత్తిన గింజ‌లు తినాలి. నువ్వుల ఉండ కూడా కీళ్ళ అరుగుద‌ల‌ను బాగా త‌గ్గిస్తుంది.

భోజ‌నంలో ఉప్పును బాగా త‌గ్గించుకోవాలి. ఎంత కుదిరితే అంత ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించ‌డం ద్వారా కీళ్ళ‌నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఉడికిన కూర‌ల‌ను కూడా చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవాలి. ఉడికిన కూర‌ల బ‌దులు ప‌చ్చి కూర‌ను తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. కీళ్ళ నొప్పులు అధికంగా ఉంటే మోకాళ్ల‌కు నువ్వుల నూనె రాసి, పావుగంట పాటు వేడి నీటి కాప‌డం పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత మోకాళ్ల‌పై త‌డిపిన న‌ల్ల‌టి ఒండ్రు మ‌ట్టి పెట్టుకొని పైన ఒక గుడ్డ చుట్టి పావుగంట పాటు ఉంచిన త‌ర్వాత క‌డిగేయాలి. ఒండ్రు మ‌ట్టి దొర‌క‌క‌పోతే త‌డిగుడ్డ కూడా మోకాళ్ల‌కు చుట్టుకోవ‌చ్చు.

కీళ్ళ నొప్పులు మొద‌లై కొంత‌కాల‌మే అవుతున్న వారికి ఈ చిట్కాలు పాటిస్తే మూడు నెల‌ల్లో నొప్పులు త‌గ్గుతాయి. దీర్ఘ‌కాలంగా కీళ్ళ నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్ల‌యితే ఇంకొంత ఎక్కువ కాలం ప‌ట్ట‌వ‌చ్చు. కాబ‌ట్టి, కీళ్ళ నొప్పులు ప్రారంభ‌మైన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఆదిలోనే కీళ్ళ నొప్పుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

Related News