తక్కువ ధరతో బెస్ట్ ఫీచర్ ఉన్న స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ. 10 వేల లోపు ధరతో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఏవి? వాటిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్, ధర లాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం
మొదటగా రియల్ మీ నార్జో 10ఏ ధరను చూస్తే.. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 8,999 కి గా ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో పాటుగా వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.5 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కూడా అదనంగా లభిస్తుంది. మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది.
రెండవది రియల్ మీ నార్జో 30ఏ. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. రూ. 8,999 గా ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉండగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మూడవ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 9 ప్రైమ్. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టార్టింగ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించారు.
నాల్గవది మోటో జీ10 పవర్. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. 6.5 అంగుళాల HD+ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో లభిస్తుంది.
ఇక పది వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్లలో చివరిది మోటో ఇ7 ప్లస్. ఈ ఫోన్ ధర రూ. 9,499 గా ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 6.5 అంగుళాల HD + మాక్స్ విజన్ డిస్ప్లే దీని ప్రత్యేకత. 13MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్ మాక్రో లెన్స్, 5MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.