logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

ప్రభాస్ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ శ్రీనివాస్ కు కలిసిరాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన మొదటి సినిమా ‘అల్లుడు శీను’ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన జయజానకినాయక, సాక్ష్యం సినిమాలు నిరాశపరిచాయి. ఒక్క రాక్షసుడు సినిమా మాత్రమే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండటంతో పరవాలేదనిపించింది. ఇలా కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ హీరో కష్టపడుతూనే ఉన్నాడు. అయినా సరైన మార్కెట్ మాత్రం క్రియేట్ అవ్వడం లేదు.

తాజాగా ఈ హీరో మరో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తన నెక్స్ట్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకోసం తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన ప్రభాస్ సినిమాను ఎంచుకుంటున్నాడు. పదిహేనేళ్ల క్రితం రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతోనే ప్రభాస్ స్టామినా మరో స్థాయికి చేరింది. ఇప్పుడు ఇదే సక్సెస్ ఫుల్ సినిమాను హిందీ ప్రేక్షకులకు రీమేక్ ద్వారా అందించబోతున్నారు.

ప్రభాస్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించబోతున్నాడు. అందుకోసం ఇప్పటికే లుక్స్ కూడా మార్చుకునే పనిలో ఉన్నాడట. అయితే ఈ సినిమాను ఇప్పటికే హిందీ ప్రేక్షకులు డబ్బింగ్ రూపంలో చూసేసారు. దీంతో ఇప్పుడు ఈ కథలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారట. అందుకోసం సినీ కథను అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ నే మరోసారి రంగంలోకి దింపనున్నారట. ఈ కథలో కొన్ని మార్పులు చేసి సెంటిమెంట్ పాళ్లను తగ్గించాలని, మాస్ ఎలిమెంట్స్ జోడించి యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దాలని కోరారట.

అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ దక్షిణాది నుంచే పవర్ ఫుల్ దర్శకుడిని ఎంచుకోనున్నారట. అందుకోసం లింగుస్వామి, ప్రభుదేవా, సుజిత్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే విజయేంద్రప్రసాద్ కథకు మార్పులు చేసేలోపు సమయం పట్టవచ్చు. ఆయన దగ్గర నుంచి కొత్త స్క్రిప్ట్ వచ్చేలోపు ఈ సినిమాకు దర్శకుడిని ఫిక్స్ చేయాలనీ నిర్ణయించుకున్నారట. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News