logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

వెనక్కి తిరిగి చూస్తే ఎలుగు బంటి.. ఆ యువతి ఏం చేసిందో చూడండి

సాధారణంగా ఎలుగుబంటిని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. కనీసం దాని దగ్గరకు వెళ్ళాలి అన్నా సరే భయపడతాం. ఒకవేళ అది మన వెనకాలే వచ్చి నిల్చుందని తెలిస్తే ఎలా ఉంటుంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తెస్తారు ఎవరైనా. ఒక యువతికి అచ్చం ఇలాంటి భయానక సంఘటనే ఎదురైంది. అయితే ఆమె దానికి భయపడలేదు సరికదా సమస్ఫూర్తితో వ్యవహరించింది. అంతేకాదు ఆ ఎలుగు బంటితో సెల్ఫీ కూడా తీసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్‌బీఏ మాజీ ఆటగాడు రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే మెక్సికోలోని మోంటెర్రేలోని చిపిన్క్యూ ఎకోలాజికల్ పార్క్ లో ఓ బృందం సందర్శనకు వెళ్ళింది. అయితే అదే సమయంలో వెనుక నుండి వచ్చిన ఓ ఎలుగు బంటి వారిని అనుసరించింది. ఆ యువతులు దానిని గమనించలేదు. అయితే అది వెనకాలే వచ్చి నిల్చునేసరికి కదలకుండా అక్కడే బొమ్మలా నిల్చుండిపోయింది.

ఆ ఎలుగు బంటి ఆ యువతి పైకి ఎక్కింది. వాసన చూసి ఆమె కాళ్ళను పామింది. అది కొంచం పక్కకు జరగగానే అక్కడి నుంచి ఆ యువతి మెల్లగా జారుకుంది. ఇలాంటి ఘటనే గతంలో ఈ పార్కులో ఒకటి జరిగింది. ఓ మహిళా సందర్శకురాలి వద్దకు వచ్చిన ఎలుగు బంటి ఆమె జుట్టును సరి చేసి వెళ్ళిపోయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

బేర్ స్మార్ట్ సొసైటీ ప్రకారం.. నల్ల ఎలుగుబంట్లు గోధుమ లేదా గ్రిజ్లీ ఎలుగుబంట్ల కంటే నెమ్మదిగా ఉంటాయని మనుషులు ఉన్న చోట ఉండటానికి అవి ఎక్కువగా ఇష్టపడతాయని అంటున్నారు. అయితే కొందరు అకారణంగా వాటిపై దాడులు చేస్తారు. కానీ అవి మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News