logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఐపీఎల్ జ‌రిగేది అప్పుడే… బీసీసీఐ క్లారిటీ

క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఇష్ట‌పడే ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. షెడ్యూల్ ప్ర‌కారం అయితే మార్చ్ 29నే ఐపీఎల్ మొద‌లు కావాల్సి ఉంది. కానీ క‌రోనా ప్ర‌భావం దేశంలో అప్ప‌టికే మొద‌లైనందున ఏప్రిల్ 15కు వాయిదా వేసింది బీసీసీఐ. అప్ప‌టికే క‌రోనా కంట్రోల్ కాక‌పోవ‌డం, లాక్‌డౌన్ ఉండ‌టంతో నిర‌వ‌ధింగా వాయిదా ప‌డింది. దీంతో ఈసారి ఐపీఎల్ ఉంటుదో, ఉండ‌దో అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి క్లారిటీ ఇచ్చారు. లాక్‌డౌన్ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఉంది. లాక్‌డౌన్ ఎత్తేసినా ప్రేక్ష‌కుల మ‌ధ్య ఐపీఎల్ నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశాలు లేవు. దీంతో ప్రేక్ష‌కులు లేకుండా అయినా ఐపీఎల్ నిర్వ‌హించే ఆలోచ‌న‌లు కూడా బీసీసీఐ చేస్తోంది. కానీ, ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది. లాక్‌డౌన్ పూర్త‌య్యాక వ‌చ్చే నెల నుంచి వ‌ర్షాకాలం మొద‌ల‌వుతుంది.

వ‌ర్షాకాలంలో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ సాధ్యం కాదు. పైగా అప్ప‌టికీ క‌రోనా వైర‌స్ పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేదు. దీంతో వ‌ర్షాకాలం వెళ్లిపోయాక అక్టోబ‌రు – న‌వంబ‌రులో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు కాస్త అవ‌కాశం ఉంది. కానీ, షెడ్యూల్ ప్ర‌కారం ఈ రెండు నెల‌ల్లో ఆస్ట్రేలియాలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గాల్సి ఉంది. వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై ఈ నెల 28న ఐసీసీ నిర్ణ‌యం తీసుకోబోతోంది. ఒక‌వేళ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డి, దేశంలో క‌రోనా అదుపులోకి వ‌చ్చి, కేంద్రం అనుమ‌తులు ఇస్తే అక్టోబ‌రులో ఐపీఎల్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి క్లారిటీ ఇచ్చారు.

Related News