logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఈ బ్యాంకులలో అకౌంట్ ఉందా? ఏప్రిల్ 1 తర్వాత సేవలు బంద్!

ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కొంతకాలంగా వివిధ బ్యాంకుల విలీన ప్రక్రియ చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే విధంగా బ్యాంకులను ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. దీంతో బ్యాంకుల పద్ధతుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారిన పద్ధతులు అమలులోకి రానున్నాయి. దీంతో ఇప్పటికే విలీనం అయిన బ్యాంకులలో ఖాతాలు ఉన్న కస్టమర్లతో గందరగోళం నెలకొంటుంది.

ఇప్పటికే విలీనం అయిన బ్యాంకులలో ఖాతాలు ఉన్న వారి బ్యాంకు పుస్తకాలను మార్చుకోవలసి ఉంటుంది. వారి బ్యాంకు ఏ బ్యాంకులో విలీనం అయిందో ఆ బ్యాంకులో కొత్తగా పాస్ బుక్, చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పటివరకు ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉన్న వారు కొత్తగా యూనియన్ బ్యాంక్ పాస్ బుక్కులను తీసుకోవాలి. లేదంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి డబులు తీసుకోవాలన్నా, చెక్కుల ద్వారా డబ్బు చెల్లించాలంటే అవి చెల్లవు.

ఇక కొత్తగా ట్రాన్సక్షన్స్ చేయాలనుకునే వారు కచ్చితంగా ఏప్రిల్ 1 కి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. విజయ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, ఓరోయెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంకులలో అకౌంట్లు ఉన్న వారంతా బ్యాంకులకు వెళ్లి ఐఎఫ్ఎస్సి కోడ్ ను మార్పించుకోవాలి. నెట్ బ్యాంకింగ్ కు సంబందించిన వివరాలను కూడా మార్చుకోవచ్చు. లేదా ఇదివరకే ఉపయోగిస్తున్న యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. అయితే ఇలా మార్చుకునే క్రమంలో కస్టమర్లు తమ ఓటీపీ వివరాలను ఎక్కడా చెప్పవద్దని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.

Related News