logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |  

బ్యాంకులకు వరుస సెలవులు.. పనులు ఉంటె ఇప్పుడే పూర్తి చేసుకోండి!

కరోనా కారణంగా బ్యాంకు సేవలను సైతం ఆన్ లైన్ ద్వారా పొందుతున్నవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అన్ని పనులు ఆన్ లైన్ లో చేసుకోలేము. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. బ్యాంకింగ్ సేవల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటివి ఉన్నా కొన్ని పనులకు మాత్రం నేరుగా బ్యాంకులు వెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ముందుగానే సెలవులకు తగ్గట్టుగా తమ పనులను ప్లాన్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉంటారు.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు బ్యాంకులకు సెలవులున్న తేదీలను పరిశీలిస్తే.. మార్చి 27 వ తేదీన నాల్గవ శనివారం. మార్చి 28న ఆదివారం. మార్చి 29న హోలీ పండగ సందర్భంగా సెలవు దినం. మార్చి 30 తేదీన చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 31 ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కాబట్టి బ్యాంకు సిబ్బంది బిజీగా ఉంటారు. సెలవు లేకపోయినా వరుస సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకోవడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున పనులు పూర్తి కాకపోవచ్చు.

ఏప్రిల్ 1వ తేదీన అకౌంట్స్ క్లోజింగ్ డే కాబట్టి బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 3న సెలవు లేకపోయినా బ్యాంకులు రద్దీగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 4న ఆదివారం కాబట్టి సెలవు. ఇక బ్యాంకు పనులు ఉన్న వారు మార్చి 27 వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలి. లేదంటే ఏప్రిల్ 5 వ తేదీ మళ్ళీ బ్యాంకులు తెరుచుకునే రోజు వరకు ఆగాల్సి ఉంటుంది. ఇక అత్యవసర బ్యాంకు లావాదేవీలు ఉన్న వారు మాత్రం ముందుగానే పనులు ముగించుకోవడం మంచిది లేదంటే ఈ వరుస సెలవుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Related News