logo

కస్టమర్లకు అలర్ట్: ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు

ఆగస్టు నెలలో భ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లనుంది. రానున్న నెలలో భారీగా సెలవులు ఉండటంతో బ్యాంకు కస్టమర్లు సెలవులకు తగ్గట్టుగా పనులు ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది. ఆగస్టు నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. బక్రీద్ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన బ్యాంకులకు సెలవు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15 వ తేదీ కూడా బ్యాంకులు పని చేయవు.

ఆగస్టు 3న రక్షా బంధన్ కావున అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, జైపూర్‌, కాన్పూర్‌, లక్నో తదితర పట్టణాలలో సెలవు ఉంటుంది. అగసు 11వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా భువనేశ్వర్‌, చెన్నై, హైదరాబాద్‌, పాట్నా తదితర ప్రాంతాలలో సెలవు ప్రకటించినట్టు సమాచారం. మరి కొన్ని నగరాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 12వ తేదీన సెలవు ఇచ్చినట్టు తెలుస్తుంది.

దీనికి తోడు ఆగస్టు నెలలో 5 ఆదివారాలు, 2 రెండో శనివారాలు ఉండనే ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవన్న విషయం తెలిసిందే. ఇక ఈ నెలలో మొత్తం 5 పండగలు కూడా ఉండటంతో 12 రోజుల పాటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి బ్యాంకు వినియోగదారులు ఈ తేదీలను గమనించుకోవాలి.

Related News