గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత నటుడు, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ను జోకర్ అంటూ చేసిన వ్యాఖ్యలకు ఆయన తాజాగా స్పందించారు. తాను జోకర్ ను కాదని ఫైటర్ ను అని అన్నారు. ఇక రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు. మీకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసారు.
ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను విమర్శిస్తూ.. గత ఎన్నికల్లో బండ్ల గణేష్ జోకర్ లా మారి ప్రజలందరినీ కడుపుబ్బా నవ్విచాడు. పూటకో వేషం, రోజుకో మాట మారుస్తూ ప్రజలను ఆకట్టుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఆ స్థానంలో బండి సంజయ్ వచ్చారన్నారు. ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి అలాగే కమెడియన్ లా మారి ప్రజలను నవ్విస్తున్నాడని అన్నారు.
కాగా కవిత వ్యంగ్యాస్త్రాలపై బండ్ల గణేష్ నొచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఆమెకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు. తనకు రాజకీయాలతో ముడిపెట్టవద్దన్నారు.