logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

పొర్లు దండాలు పెట్టినా సరే.. కేసీఆర్ ను వదిలేది లేదు: బండి హాట్ కామెంట్స్

సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన కేసీఆర్ నేరుగా ఫార్మ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనంగానే ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ రైతుల నిరసనలకు మొదట మద్దతు తెలిపిన కేసీఆర్ ఆ తర్వాత ఎనక్కి తగ్గారు. అంతే కాదు గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. దీంతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయంపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కథ ఇదీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ తనపై తన కుటుంబంపై కేసులు పెట్టి జైలుకు పంపవద్దని కోరారని అన్నారు. పొర్లు దండాలు పెట్టినా సరే కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలెను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుందని సంకేతాలు ఇస్తున్నారన్నారు. సిగ్గు, బుద్ది ఉన్నవారెవరూ కూడా టీఆరెస్ తో పొత్తు పెట్టుకోరంటూ బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related News