logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

‘బీజేపీ బరాబర్ హిందువుల పార్టీనే.. అడ్డొస్తే తొక్కేస్తాం’: బండి సంజయ్ ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ నిజాం ను స్ఫూర్తిగా తీసుకుని నియంత పాలన సాగిస్తున్నారన్నారు. బీజేపీ బారాబర్ హిందువుల పార్టీనే.. హిందూ ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తామంటూ ఫైర్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలు బీజేపీకి ఎంతో ముఖ్యమైనవని ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్దలకొడతామన్నారు.

తెలంగాణలో బియ్యం, రోడ్లు, ఇల్లు, లైట్లు, టాయిలెట్లు అన్ని కేంద్రం ఇస్తున్నవే అన్నారు. అన్నీ కేంద్రమే ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. వరదలకు బిల్డింగులు మునగలేదు కాబట్టే సహాయానికి కేసీఆర్ బయటకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. పేదవారికి కష్టం వస్తే పరామర్శించకపోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు.

ఇది ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యమన్నారు. వరద నష్టం పై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం అందజేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ ను ప్రజలు బొందపెడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే, కేసీఆర్ లాడెన్, అక్బర్ వారసుడంటూ ఎద్దేవా చేసారు.

Related News