logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కేంద్రం ప్యాకేజీ కేసీఆర్ కు అందుకే నచ్చలేదు: బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ మంత్రులపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. వేములవాడలో పర్యటించిన బండి సంజయ్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రులపై ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందిస్తూ.. కేంద్రం నిధులు పక్క దారి పెట్టె అవకాశం లేకుండా నేరుగా వినియోగదారులకు లబ్ది చేకూరేలా ప్యాకేజి రూపొందించిందని అందుకే ఈ ప్యాకేజీ కేసీఆర్ కు నచ్చలేదని విమర్శలు చేసారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుంటే రాష్ట్రాన్ని కాపాడలేక కేసీఆర్ చేతులు ఎత్తేశారని అన్నారు.

తెలంగాణాలో ఇప్పటివరకు ఎన్ని టెస్టులు చేపట్టారో స్పష్టం చేయాలని మరోసారి డిమాండ్ చేసారు. ఆరోగ్య శ్రీ నుంచి కరోనా చికిత్సను ఎందుకు తొలగించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో ఎవరూ తమ సమస్యలను బయటకు చెప్పే పరిస్థితి లేదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారన్నారు. ప్రభుత్వం తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని తీవ్ర విమర్శలు చేసారు.

Related News