logo

మమ్మల్ని గెలిపిస్తే ఇంటికి రూ. 25 వేలు: బండి సంజయ్

ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ అన్నారు. ప్రధానిని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని అందుకే గెలవగానే ఆ ఫ్రంటూ.. ఈ ఫ్రంటూ అన్నారు. ఇప్పుడు టెంటు కూడా లేకుండా పోయింది. కేసీఆర్ ఢిల్లీకి వెళితే అసలు పట్టించుకునేవారే లేరని ఎద్దేవా చేసారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్తని మేయర్ గా గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ. 10 వేలు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు తమను గెలిపిస్తే ప్రతి ఇంటికి వరద సాయం కింద రూ. 25 వేలు ఇస్తామన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్కరికి లబ్ది జరిగేలా చేస్తామన్నారు.

విమర్శలు కూడా అప్రజాస్వామ్య బద్దంగా ఉండాలన్నారు. కేసీఆర్ ఒక దేశద్రోహి ఆయనకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు అని విరుచుకుపడ్డారు. నిజంగా కేసీఆర్ హిందువైతే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేపు 12 గంటలకు నకిలీ లేఖపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. తెలంగాణలో కచరాను సాఫ్ చేయాలనీ అనుకుంటున్నాం. గత 6 ఏళ్లలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. టీఆర్ ఎస్ మ్యానిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించినా తమ దగ్గర ఆ కాపీ అలాగే ఉందన్నారు.

Related News