logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఫ్రంట్ పేజీలో వార్త కోసమే హరీష్ రావు లేఖ: బండి సంజయ్

దుబ్బాక ఉపఎన్నికల కోసం స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తన 18 ప్రశ్నలకు జవాబు చెప్పి తెలంగాణ రాష్ట్రం పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ ఓ బహిరంగ లేఖను రాసారు మంత్రి హరీష్.

ఈ లేఖపై స్పందించిన బండి సంజయ్ హరీష్ రావు పై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. రేపు ఫ్రంట్ పేజీలో రావాలనే తాపత్రయంతోనే ఈ లేఖ రాసారని ఎద్దేవా చేసారు. ఇక ముఖ్యమంత్రికి కలలో కూడా దుబ్బాకే గుర్తుకొస్తుంది అన్నారు. దుబ్బాక చౌరస్తాలో కేసీఆర్ తో నేను చర్చకు రెడీ అంటూ మరో సవాలు విసిరారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ కు ఆస్కార్ ఇవ్వచ్చన్నారు.

మరోవైపు సంజయ్ అరెస్టు నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో నలభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related News