జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ఛలో జనగామ’కు పిలుపునిచ్చారు. మరికొద్ది సేపట్లో ఆయన జనగామ బయలుదేరి వెళ్లనున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను కలుసుకుని వారితో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బండి సంజయ్ జనగామ పర్యటన సందర్భంగా అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జనగామ మునిసిపల్ కార్యాలయం నుంద ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలపై సిఐ మల్లేష్ లాటి ఛార్జ్ చేసారని వారిని విచక్షణా రహతంగా దాడి చేసారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
సిఐ మల్లేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామకు బండి సంజయ్ పర్యటనతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.