గ్రేటర్ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదవారికి ఇస్తానన్న ఇల్లు ఇప్పటికీ ఇవ్వలేదు. అక్రమ కట్టడాల పేరుతో కూలుస్తున్నారు. కూల్చాల్సింది పేదవాడి ఇల్లు కాదు.. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతుంది.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ అక్బరుద్దీన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ పీవీ సమాధులు కూలుస్తాడంట దమ్ముంటే కూల్చారా.. నీ దారుస్సలేం భవనాన్ని రెండు నిమిషాల్లో కూల్చేస్తారు మా కార్యకర్తలు అని ఎంఐఎం పార్టీకి సవాల్ విసిరారు. మా బీజేపీని ఢిల్లీ పార్టీ అని ఒకడు అంటున్నాడు… మీది గల్లీ పార్టీ.. గడీల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ పార్టీ అయినా ప్రజలకు ప్రధాన మంత్రి పథకాలన్నీ చేరువయ్యాయన్నారు.
స్థానిక పార్టీలుగా చెప్పుకుంటున్న మీరు కేంద్రం నిధులు లేకుండా ఏ సంక్షేమ పథకాలు అమలు చేసారో చెప్పాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే.. పాకిస్తాన్ గెలవాలి అన్నోడిని తరిమికొట్టాలా లేదా అని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ వాళ్లందరినీ తరిమి కొట్టాల లేదా టీఆరెస్ పార్టీకి ఎంఐఎం అంటే ఉచ్చ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.