logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

బ్రేకింగ్: న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం…!

ప్రతి ఏటా క్రిస్టమస్, కొత్త సంవత్సరం వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది భాగ్యనగరం. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా పరిస్థితి తలకిందులైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టబోతున్నా ఆ జోష్ ఎక్కడా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలపై నగరవ్యాప్తంగా నిషేధం విధించారు.

ఈమేరకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగరవాసులకు పలు సూచనలు చేసారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతి లేదని సజ్జనార్ స్పష్టం చేసారు. ఇప్పటికే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు మొదలు పెట్టామన్నారు. పబ్బులు, క్లబ్బులపై ఇప్పటికే నిఘా ఉంచామన్నారు.

ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్బులు, రిసార్టులకు కూడా అనుమతులు లేవని, గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం న్యూ ఇయర్ వేడుకల పై నిషేధం విధించినట్లుగా పేర్కొన్నారు. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కూడా అనుమతి ఉండదని అయితే స్టార్ హోటల్స్ లో రోజువారీ కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.

Related News