logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

దీపావళి బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలు జారే చేసింది. రాష్ట్రంలో బాణాసంచా పై నిషేధం విధించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న వేళ బాణాసంచా కారణంగా వారిలో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈరోజు పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకుంది. బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే తుపాకులు కాల్చకుండా ప్రజల్లో అవగాహనా కల్పించాలని కోర్టు పేర్కొంది.

ఇప్పటివరకు బాణాసంచా అమ్మకాల కోసం తెరచిన దుకాణాలను కూడా మూసివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో బాణాసంచాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దీనిపై పూర్తిగా నిషేధం విధించకపోయినా వాటికి దూరంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది.

Related News