logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

బంపర్ ఆఫర్: ఫీజులకు బదులుగా కొబ్బరిబొండాలు అడుగుతున్న కాలేజీ

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎన్నో రంగాలు ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అటు సామాన్య ప్రజలను కూడా ఎన్నడూ లేనన్ని ఇబ్బందులకు గురి చేసింది కరోనా. దీంతో తలిదండ్రులకు బదులు తెరుచుకున్నా స్కూలు, కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఓ కాలేజీ తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకుని ఓ వినూత్న ప్రకటన చేసింది.

ఫీజులు చెల్లించలేని విద్యార్థులు ఫీజు కింద కొబ్బరి బోండాలను తెచ్చి ఇవ్వొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వింత జరిగింది ఇండోనేషియాలోని బాలీలో. బాలి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది అందమైన ద్వీపం, ఆహ్లాదపరిచే బీచ్ లు. అయితే కరోనా కారణంగా అక్కడి పర్యాటక రంగానికి కూడా భారీగా నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి పర్యాటకంపై ఆధారపడిన ప్రజలు జీవనోపాథి కోల్పోయారు.

ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చే మార్గం కూడా కనిపించడం లేదు. దీంతో అక్కడి కాలేజీ యాజమాన్యాలు నగదుతో పని లేకుండా విద్యార్థులను ఫీజులకు బదులుగా కొబ్బరి బోండాలను తెచ్చి ఇస్తే చాలని చల్లని కబురు వినిపించింది. ఈ పిలుపుకు ఊహించని విధంగా స్పందన వస్తుంది. దీంతో సహజసిద్ధమైన వస్తువులను కూడా ఫీజుల కింద తీసుకుంటామని మరో ప్రకటన చేశాయి.

కాలేజీ వారు ఈ ఉత్పత్తులతో కొబ్బరినూనె, సహజసిద్ధ సబ్బులు, మూలికలతో కూడిన ఉత్పతులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే కావాలనుకుంటే విద్యార్థులే తమ ఉత్పత్తులను విక్రయించి నైపుణ్యాలను పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వినూత్న ఆలోచన చేసిన కాలేజీ వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Related News