నందమూరి అభిమానులకు మైత్రి మూవీ మేకర్స్ శుభవార్త వినిపించింది. ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్టందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ దర్శకుడితో భారీ ప్రాజెక్టును ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్. నందమూరి బాలకృష్ణతో- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టుగా ప్రకటించారు.
ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బోయపాటితో బీబీ3 షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా పాటలెక్కనుందని తెలిపారు. కాగా గోపీచంద్ మలినేని బాలయ్యతో సినిమా చేయనున్నాడనే కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఉప్పెన’ సినిమా ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తలపైక్లారిటీ ఇచ్చారు.
బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఓ పవర్ ఫుల్ స్టోరీని తయారు చేస్తున్నాడని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలను మించేలా ఈ సినిమా అందబోతుందని ప్రకటించారు. త్వరలోనే అందుకు సంబందించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.