logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

సినీ నటి సాయిసుధ – శ్యామ్ కె నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ !

సినీ నటి సాయి సుధ – ప్రముఖ్య సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. తనను పెళ్లి చేసుకుంటానని తనతో కొంతకాలం రిలేషన్ మెయింటైన్ చేసి పెళ్లి మాట ఎత్తగానే మొహం చాటేసాడని ఇటీవల సాయి సుధ సంచలన ఆరోపణలు చేసింది. శ్యామ్ కె నాయుడు పై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేసి పోలీసులు రిమాండుకు తరలించారు.

అయితే రిమాండుకు వెళ్లిన రెండు రోజులకే నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చేసాడు. బాధితురాలు సాయి సుధ తో రాజీ చేసుకున్నానని చెప్పి నాంపల్లి కోర్టులో బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేసాడు. దీనిపై విచారణ చేసిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సాయి సుధ ఈ విషయంపై మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించింది.

తాను రాజీకొచ్చానని చెప్పినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేసాడని న్యాయస్థానం ముందు విన్నవించింది. దీంతో కోర్టు అతని పిటిషన్ ను కొట్టివేయడమే గాక బెయిలు రద్దు చేసింది. ఈ పరిణామంతో శ్యామ్ కె నాయుడు మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. శ్యామ్ కె నాయుడు సోదరుడు చోటా కె నాయుడు టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ లలో ఒకడు. అతని ద్వారానే అతని మేనల్లుడు హీరో సందీప్ కిషన్ వెండి తెరకు పరిచయమయ్యాడు. శ్యామ్ కె నాయుడు వ్యవహారం ఇపుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Related News