logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఇంటి వద్దకే భద్రాద్రి రాములవారి తలంబ్రాలు, ప్రసాదం ఇలా పొందండి

శ్రీరామనవమి పండుగకు భద్రాద్రి ఆలయం ముస్తాబవుతోంది. ఏప్రిల్ 21 వ తేదీన జరగనున్న స్వామివారి కల్యాణానికి ఇప్పటి నుంచే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది స్వామి వారి కళ్యాణం భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరిగింది. ఇప్పుడు మరోసారి దేశంలో కరోనా విరుచుకుపడుతుండటంతో ఈ ఏడాది కూడా భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం కల్పించే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది.

ప్రతి ఏటా రాములవారి కళ్యాణం తర్వాత లభించే తలంబ్రాలు, ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అయితే ఈ సారి కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ బాధ్యతను తపాలా శాఖ చేపట్టింది. స్వామివారి ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఇంటివద్దకే చేరవేసేందుకు ఖమ్మం డివిజన్ తపాలా శాఖ ప్రక్రియను ప్రారంభించనుంది.

భక్తులు తలంబ్రాలు, ప్రసాదాల కోసం సమీప పోస్టాఫీసు కు వెళ్లి రూ. 300 వందలు చెల్లించాల్సి ఉంటుంది. తమ గోత్రనామాలు, చిరునామాను అక్కడ తెలపాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న భక్తుల పేరుపై శ్రీరామ నవమి రోజున భద్రాద్రి ఆలయంలో గోత్రనామాలతో అర్చన నిర్వహిస్తారు. అనంతరం ప్రసాదాలు, రెండు ముత్యాల తలంబ్రాలతో కూడిన పార్సల్ ను స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారు.

భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఎవరైనా భద్రాచలం వెళ్లి వస్తే వారిని ప్రసాదానికి బదులుగా తలంబ్రాలు అడుగుతుంటారు. స్వామి వారికోసం గోదావరి జిల్లాల్లోని భక్తులు గోటితో వలిచిన బియ్యాన్ని పంపుతారు. ప్రతి ఏడు స్వామివారి కల్యాణానికి సంబందించిన తలంబ్రాలను ఎంతో భక్తిశ్రద్దలతో తయారు చేస్తారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొనే అర్చకులు, రుత్వికుల సతీమణులు చేతుల మీదుగా పసుపును దంచుతారు.

ఆ తర్వాత పసుపు, కుంకుమ, నెయ్యి, అత్తరు, నూనె, బుక్కగుళాలు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలను కలిపి సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలను సిద్ధం చేస్తారు. కల్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలను భక్తులు భద్రపరుచుకుని వివాహ సమయంలో తలంబ్రాలలో కలుపుతుంటారు.

Related News