logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

పిల్లల తల వెంట్రుకలు పొడవుగా పెరగాలంటే ఇలా చేయండి!

చిన్న పిల్లల్లో సహజసిద్ధంగానే ఎలాంటి జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు ఉండవు. అయితే ఇదంతా వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ఎదిగే పిల్లల జుట్టు సంరక్షణ పై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కొంత మంది పిల్లల్లో చిన్న వయసులోనే జుట్టు పలుచగా మారడం, నిర్జీవంగా ఉండటం చూస్తాము. అది పిల్లల వయసు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఇలా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి వివిధరకాల ఇన్ఫెక్షన్లు కూడా జుట్టు సరిగా పెరగకపోవడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా ఆడపిల్లలైతే కొద్ది పాటి జాగ్రత్తలు పాటించడం వల్ల వారు పెరిగే సమయానికి ఆరోగ్యవంతమైన జుట్టుతో మరింత అందంగా ఉంటారు.

ఇవే కాక మనం వారి శిరోజాల కు వాడే ప్రొడక్ట్స్, కెమికల్స్ కూడా కారణమవుతాయి. చాలా మంది తల్లులు పెద్దవాళ్ళు వాడే షాంపూలనే పిల్లలకు కూడా ఉపాయగిస్తారు. అందువల్ల చాలా సున్నితమైన వారి శిరోజాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందురు వారి కోసం నో టియర్ షాంపూను వాడాలి. అందులో కెమికల్స్ ఉండవు. కళ్ళు కూడా మండకుండా ఉంటాయి. పిల్లలలకు చైనా వయసులోనే స్ట్రెయిటనింగ్ వంటి హాయ్ హీట్ ట్రీట్మెంట్లను ఉపయోగిస్తుంటారు. దాని వల్ల పెరిగే కొద్దీ జుట్టు డ్యామేజీ అయ్యి పెరుగుదల ఆగిపోతుంది.

పిల్లల జుట్టుపై శ్రద్ధ వహించే వారు పోనీ టెయిల్స్ వేసేటప్పుడు గట్టిగా బిగించడం వంటివి చేయొద్దు. జుట్టు తడిగా ఉన్నప్పుడు చిక్కులు తీయడం వల్ల జుట్టు సాగినట్టుగా మారుతుంది. ఆ తర్వాత జుట్టు బలహీనపడి తెగిపోతుంది. పిల్లల జుట్టుపోడవుగా ఉంటె ఏదైనా మైల్డ్ కండిషనర్ ను వాడండి అప్పుడు చిక్కు పడదు. అనారోగ్య సమస్యలు ఉన్నా చిన్న పిల్లలో జుట్టు ఊడిపోతుంది. అలాంటి వారు ఒకసారి వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవాలి. స్నానం చేయించే సమయంలో అతిగా వేడి నీరు, లేదా అతి చల్లని నీటిని ఉపయోగించకండి గోరు వెచ్చని నీటి మాత్రమే వాడండి. పిల్లల జుట్టు ఎప్పుడు తేమగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం తరచుగా జుట్టుకు నూనెతో మాసాజ్ చేయాలి. ఇలా ఒక రొటీన్ పద్దతిని ఫాలో అవ్వడం వల్ల జుట్టుకు మాయిశ్చరైజేషన్ లభించి ఆరోగ్యంగా పెరుగుతుంది. పిల్లల తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది.

రోజ్ మేరీ ఆయిల్ తో పాటుగా కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ కలిపి బేబీ కి ఆయిల్ మసాజ్ చేయవచ్చు. పిల్లలకు అవసరమైన కొన్ని రకాల న్యూట్రియంట్స్ అందని సమయంలో కూడా పిల్లలకు జుట్టు సమస్యలు వస్తాయి. అందుకే వారికి తరచుగా ఆకుకూరలు, కమలా పండ్లు, టమాటాలు, స్ట్రాబెరీలు, సిట్రస్ ఫ్రూట్స్ ను వారు తినగలిగే విధంగా మార్చి అందించాలి. పిల్లలకు అప్పుడప్పుడు కొన్ని రకాలహెయిర్ మాస్కులను కూడా వేయవచ్చు.పెద్దవారికే కాదు చిన్న పిల్లల జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరి పాలు బాగా పనిచేస్తాయి. అప్పుడే తీసిన కొబ్బరి పాలను పిల్లల తలకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేయండి అరగంట తర్వాత మాములు ట్యాప్ వాటర్ తో తలను కడిగేయవచ్చు. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు.

మెంతులను కూడా మాస్క్ లా చేసి తలకు పట్టించి నలభై నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా చేయడం వల్ల జుట్టు చాలా సాఫ్ట్ గా మారుతుంది. అప్పుడు వారికి ప్రత్యేకించి ఎలాంటి కండిషనర్లు, బ్లో డ్రై ల అవసరం ఉండదు. అయితే ఇవన్నీ వాతారవం మార్పులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చేయాలి. వాతావరణం చల్లగా ఉన్నపుడు హెయిర్ మాస్కులు వేస్తే జలుబు చేసే అవకాశం ఉంటుంది. పిల్లల జుట్టు పోషణలో బయోటిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. వైద్యుల సలహా మేరకు వీటిని వాడవచ్చు. లేదంటే ఉడికించిన ఎగ్స్ యోగర్ట్, ఆల్మోన్డ్, నట్స్, పాలపదార్థాల్లో బయోటిన్ లభిస్తుంది. వీటిని వారి డైట్ లో చేర్చవచ్చు.

 

 

Related News