logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనా వైరస్ కు మందు కనిపెట్టాం: బాబా రాందేవ్

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు మందు కనుగొన్నామని ఆధ్యాత్మిక గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ప్రకటించారు. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వినియోగిస్తున్న గిలాయ్(తిప్పతీగ), అశ్వగంధలకు కోవిడ్-19 ను అరికట్టగలం సామర్థ్యం ఉందన్నారు.

కరోనా వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోయి కణాలను ప్రభావితం చేస్తుందని అందువల్ల అది ఇతర కణాలకు కూడా చేరుతుందన్నారు. అశ్వగంధ శరీరంలోని ఈ వైరస్ చైన్ ను తెంచడంలో 100 శాతం పనిచేసిందన్నారు. తాము ప్రాణాంతక కోవిడ్ వైరస్ భారిన పడిన రోగులపై దీనిని ప్రయోగించామని, 100 శాతం ఈ మందు వారిపై పనిచేసిందన్నారు. మరణాల సంఖ్య కూడా నమోదు కాలేదన్నారు.

ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న ఈ మందును త్వరలోనే ఈ శాస్త్రీయ పత్రాలతో ప్రజల ముందు ప్రవేశపెడతామని బాబా రాందేవ్ పేర్కొన్నారు. మరోవైపు జపాన్ కు చెందిన AIST సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజి(ఐఐటి) ఢిల్లీ శాస్త్రవేత్తల బృఉండం అశ్వగండకు కరోనాన్తో పోరాటం చేయగల సామర్థ్యము ఉందని కనుగొన్నారు.

Related News