logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

పాపం.. పెద్దాయ‌న డ‌బ్బులు కాజేసిన యూట్యూబ‌ర్‌

ఇటీవ‌ల ఓ చిన్న హోట‌ల్ న‌డుపుకునే ఓ పెద్దాయ‌న వీడియో దేశ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యింది. లాక్‌డౌన్ కార‌ణంగా హోట‌ల్ మూత‌బ‌డటం వ‌ల్ల ఓ వృద్ధ దంప‌తుల వేద‌న‌ను ఈ వీడియో దేశానికి చూపించింది. ఈ వీడియో ద్వారా వృద్ధుల బాధను అర్థం చేసుకున్న దాత‌లు, సెల‌బ్రిటీలు వెంట‌నే స్పందించి హోట‌ల్ నిర్వ‌హించే వృద్ధ దంప‌తుల‌ను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశారు. దీంతో ఒక చిన్న వీడియో వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపింద‌ని అంతా సంతోషించారు.

అయితే, ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం మొత్తం కొత్త మ‌లుపు తిరిగింది. త‌న ఆవేద‌న‌పై వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ‌ర్‌పైనే హోట‌ల్ నిర్వాహ‌కుడైన వృద్ధుడు కాంత‌ప్ర‌సాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌ను స‌ద‌రు యూట్యూబ‌ర్ మోసం చేశార‌ని, త‌న‌కు వ‌చ్చిన విరాళాల‌ను దుర్వినియోగం చేశార‌ని ఆయ‌న యూట్యూబ‌ర్ గౌర‌వ్‌ వాస‌న్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

సౌత్ ఢిల్లీలో 80 ఏళ్ల కాంత‌ప్ర‌సాద్‌, ఆయ‌న భార్య బాబా కా దాబా అనే పేరుతో చిన్న హోట‌ల్ న‌డిపిస్తారు. ముస‌లి వ‌య‌స్సులో త‌మ‌ను ఆదుకునే వారు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఈ దంప‌తులు ఇంకా క‌ష్టాన్నే న‌మ్ముకొని ఒంట్లో స‌త్తువ త‌గ్గినా అతి క‌ష్ట‌మ్మీద హోట‌ల్ నిర్వ‌హిస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఇలా సాగుతున్న వీరి జీవితంపై క‌రోనా పిడుగు ప‌డింది. లాక్‌డౌన్ కార‌ణంగా హోట‌ల్ మూత‌బ‌డింది. దీంతో కాంత‌ప్ర‌సాద్ దంప‌తుల‌కు విప‌రీత‌మైన ఆర్థిక క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

గ‌త నెల‌లో గౌర‌వ్ వాస‌న్ అనే ఓ యూట్యూబ‌ర్ వీరి హోట‌ల్‌కు వెళ్లారు. గౌర‌వ్ వాస‌న్ ద‌గ్గ‌ర ఈ వృద్ధులు త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. లాక్‌డౌన్‌, క‌రోనా వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయో చెబుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఇదంతా గౌర‌వ్ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. వృద్ధ దంప‌తుల‌ను ఆదుకోవాల‌ని కోరాడు.

ఈ వీడియో బాగా వైర‌ల్ కావ‌డంతో దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు వ‌చ్చాయి. కొంద‌రు సెల‌బ్రిటీలు, బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాల‌తో వృద్ధ దంప‌తుల క‌ష్టాలు తొల‌గిపోయాయ‌ని అంతా అనుకుంటుండ‌గా క‌థ కొత్త మ‌లుపు తిరిగింది. యూట్యూబ‌ర్ గౌర‌వ్ వాస‌న్ త‌మ‌ను మోసం చేశాడ‌ని, విరాళాలను దుర్వినియోగం చేశాడ‌ని వృద్ధుడు కాంత‌ప్ర‌సాద్ ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఉద్దేశ‌పూర్వ‌కంగా విరాళాల కోసం గౌర‌వ్ వాస‌న్ కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల బ్యాంకు అకౌంట్ల వివ‌రాల‌ను ఇచ్చార‌ని, దాత‌లు విరాళాలు ఈ అకౌంట్ల‌కే పంపించారని కాంత‌ప్ర‌సాద్ అంటున్నారు. ఈ విరాళాల‌ను దుర్వినియోగం చేశార‌ని, విరాళాల గురించి త‌న‌కు స‌రిగ్గా స‌మాచారం ఇవ్వ‌కుండా మోసం చేశార‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు ఆయ‌న ఫిర్యాదుపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

Related News