logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

అయోధ్య‌లో కొత్త రామ మందిరం ఇలా ఉండ‌బోతోంది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందువులంతా ఐదు శ‌తాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య‌ రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖ‌రారైంది. ఆగ‌స్టు 5వ తేదీన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌ర‌గ‌బోతోంది. మ‌ధ్యాహ్నం స‌రిగ్గా 12 గంట‌ల 12 నిమిషాల 15 సెక‌న్లకు భూమి పూజ ప్రారంభం కాబోతోంది. ఐదు వెండి ఇటుక‌ల‌ను పేర్చి ప్ర‌ధాని మోదీ రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.

హిందువుల ఆరాధ్య దైవం రాముడికి అయోధ్య‌లో వేల ఏళ్ల పాటు చెక్కుచెద‌ర‌కుండా ఉండే భ‌వ్యమైన ఆల‌యాన్ని నిర్మిచాల‌ని రామ జ‌న్మ‌భూమి తీర్థ ట్ర‌స్ట్ నిర్ణ‌యించింది. కోట్లాది హిందువుల చిర‌కాల కోరిక అయిన రామ‌మందిరం ఎలా ఉండ‌బోతోందో ఈ వీడియోలో ఓసారి చూద్దాం.

రామ మందిర నిర్మాణానికి ప్ర‌ముఖ ఆర్కిటెక్ట్ చంద్ర‌కాంత్ సోంపురా, అత‌ని కుమారుడు డిజైన్ రూపొందించారు. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన ఈ కుటుంబం గ‌త 15 త‌రాలుగా ఇదే వృత్తిలో ఉంది. దేశ‌విదేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు వీరు 131 ఆల‌యాల నిర్మాణానికి ప‌ని చేశారు. నిజానికి 30 ఏళ్ల క్రిత‌మే చంద్ర‌కాంత్ సోంపురా అయోధ్య రామాల‌యానికి డిజైన్ రూపొందించారు. ఇప్పుడు ఆ డిజైన్‌లోనే మండ‌పం, శిఖరం వంటివి కొన్ని మార్చి, మ‌రింత విస్తారంగా ఆల‌య నిర్మాణానికి కొత్త డిజైన్ చేశారు.

కొత్త‌గా నిర్మించ‌బోయే రామాల‌యం ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయే రీతిలో భారీ నిర్మాణంగా ఉండ‌బోతోంది. 161 అడుగుల ఎత్తులో మూడు అంత‌స్తులుగా ఆల‌య నిర్మాణం జ‌రుగుతోంది. ప్ర‌తి అంత‌స్తుకు 106 పిల్ల‌ర్ల చొప్పున‌ మొత్తం ఆల‌యానికి 318 పిల్ల‌ర్లు ఉంటాయి. 140 ఫీట్ల వెడ‌ల్పులో ఆల‌యం ఉంటుంది. గ‌తంలో చేసిన పాత డిజైన్‌లో రెండు అంత‌స్తుల ఆల‌యం నిర్మించాల‌ని అనుకున్నారు. కానీ, ఆల‌యం ఇంకా గొప్ప‌గా ఉండేందుకు ఇప్పుడు మూడు అంత‌స్తులుగా నిర్మాణం జ‌రుగుతోంది. భ‌క్తులు ఆల‌యం లోప‌ల ప్ర‌ద‌క్షిణ‌లు చేసుకునే విధంగా డిజైన్‌ను రూపొందించారు. ఇరుకుగా కాకుండా ఆల‌యం లోప‌లే భ‌క్తులు కొన్ని చోట్ల కూర్చొని ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో కొంత సేపు ఉండే అవ‌కాశం ఉండేలా నిర్మాణం ఉంటుంది.

ఆల‌‌యానికి మొత్తం ఐదు భారీ గోపురాలు ఉండ‌బోతున్నాయి. ఐదు గోపురాల‌తో నిర్మించ‌బోతున్న ఆల‌యం ప్ర‌పంచంలో అయోధ్య రామ మందిరం ఒక్క‌టే. మొత్తం 67 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆల‌య ప్రాంగ‌ణంలో 10 ఎక‌రాల్లో పూర్తిగా ఆల‌యం నిర్మిస్తుండ‌గా 57 ఎక‌రాల్లో ఇత‌ర ఆధ్మాత్మిక నిర్మాణాలు, ఇత‌ర దేవుళ్ల ఆల‌యాలు నిర్మాణం కాబోతున్నాయి.

మొత్తం రాతితో ఈ నిర్మాణం జ‌రుగుతోంది. ఇందుకు గానూ ఇప్ప‌టికే 40 శాతం రాతిని కూడా సేక‌రించి పెట్టారు. 318 పిల్ల‌ర్లు, ఆల‌య గోడ‌ల‌పై హిందూ పురాణాలకు సంబంధించిన విష‌యాల‌ను, ఆకారాల‌ను శిల్పాల రూపంలో చెక్క‌బోతున్నారు. ఆల‌య నిర్మాణం ప‌టిష్ఠంగా ఉండేలా డిజైన్ రూపొందించారు. 15 అడుగుల లోతు నుంచి పునాదులు వేయ‌నున్నారు. ఆల‌యంలో దేవుళ్ల విగ్ర‌హాల రూప‌క‌ల్ప‌నకు సంబంధించి సాధువుల స‌ల‌హాల‌ను తీసుకుంటున్నారు.

ఆగ‌స్టు 5న ఆల‌య నిర్మాణానికి భూమి పూజ జ‌రుగుతుండ‌గా ఇప్ప‌టికే నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల‌ను ట్ర‌స్ట్ చేసింది. మూడు నుంచి మూడున్న‌ర ఏళ్ల‌లో అయోధ్యలో అద్భుత‌మైన రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అర్కిటెక్ట్‌లు చెబుతున్నారు. అంత‌ర్జాతీయ నిర్మాణ సంస్థ ఎల్ ఆండ్ టీ ఈ నిర్మాణాన్ని చేప‌ట్ట‌బోతోంది. ఇప్ప‌టికే భారీ నిర్మాణ యంత్రాలు, సామాగ్రితో అయోధ్య‌లో ఎల్ ఆండ్ సంస్థ సిద్ధంగా ఉంది.

Related News