logo

  BREAKING NEWS

విశాఖ ప్లాంట్ తో మీకేంటి సంబంధం.. పార్లిమెంట్ సాక్షిగా కేంద్రం క్లారిటీ!  |   ఏపీ: అక్కడ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కీలక ఆదేశాలు!  |   మహిళ చెంప చెళ్లుమనిపించిన అశోక్ గజపతిరాజు.. కారణం ఇదే!  |   టీఆర్ఎస్ మహిళా మంత్రికి కరోనా.. ఆ నేతల్లో టెన్షన్!  |   విమెన్స్ డే: ఏపీ మహిళలకు సీఎం జగన్ శుభవార్త!  |   మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. 07.03.2021 బంగారం ధ‌ర  |   ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |  

”గుడి కూలితే వామన్ రావు కూలతాడు”.. నిందితుడి ఆడియో టేప్ కలకలం!

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వామన్ రావు ఆయన భార్య నాగమణిని కారులో హైదరాబాద్ వెళ్తుండగా అడ్డగించిన దుండగులు అతి దారుణంగా వేట కొడవళ్ళతో నరికి చంపారు. కాగా తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ గా ఆఖరి క్షణాల్లో వామన్ రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ 1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కుంట శ్రీనివాసరావు సుపారీ గ్యాంగ్ తో మాట్లాడిన ఒక ఆడియో టేపు బయటకు వచ్చింది.

గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే వామన్ రావు దంపతుల హత్యకు కారణంగా తెలుస్తుంది. ఈ ఆడియో 2018 కి సంబంధించినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడు కుంటా శ్రీనివాస్ ‘గుడి కూలితే వామన్ రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్ మాట్లాడినట్టుగా తేలింది.

ఈ కేసులో హతుడు వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు ఏ -1 గా కుంట శ్రీనివాస్ , ఏ -2 గా అక్కపాక కుమార్, ఏ -3 గా వసంతరావును పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరినీ అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు ఈ హత్య కేసు రాజకీయా రంగు పులుముకుంటుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ హత్య వెనుక ప్రభుత్వ పేదల హస్తముందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన వారి కుటుంబానికి అండగా ఉంటామని బీజేపీ తరపున న్యాయం జరిగేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ సైతం తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కనీసం సీఎం కేసీఆర్ ఈ ఘటనపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Related News