logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

టీవీ5పై దాడి ఎవ‌రు చేశారో తేలింది.. నిందితుడి అరెస్ట్‌..!

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీవీ5 న్యూస్ ఛాన‌ల్ కార్యాల‌యంపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఓ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో ఒక రాయి టీవీ5 కార్యాల‌యంలోని సెక్యూరిటీ రూమ్ వైపు విసిరాడ‌ని తేలింది. వివ‌రాల్లోకెళ్తే.. ఈ నెల 8వ తేదీన సాయంత్రం టీవీ5 కార్యాల‌యంలో సెక్యూరిటీ రూమ్‌పై దాడి జ‌రిగింది. ఈ విష‌యంపై టీవీ5 సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. టీవీ5పై దాడి క‌ల‌క‌లం రేపింది. ఈ దాడిని చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా వివిధ పార్టీల నేత‌లు ఖండించారు.

జ‌ర్న‌లిస్టు సంఘాలు, నేత‌లు సైతం టీవీ5పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక రాజ‌కీయ శ‌క్తులు ఉన్నాయ‌నే అనుమానాలు మొద‌లయ్యాయి. అయితే, పోలీసులు విచార‌ణ ప్రారంభించి నిందితుడిని ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న కేవ‌లం మ‌ద్యం మ‌త్తులో ఫుట్‌పాత్‌పై నివ‌సించే వ్య‌క్తి చేసిందే అని తేల్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన టి.చిరంజీవి అనే వ్య‌క్తి ఫుల్లుగా మ‌ద్యం తాడి ఏం చేస్తున్నాడ‌నే సోయి లేక ఒక రాయిని టీవీ5 కార్యాల‌యం వైపు విస‌ర‌గా సెక్యూరిటీ రూమ్ అద్దం ప‌గిలింది.

త‌ర్వాత కూడా ఇత‌డు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ద్ద న్యూసెన్స్ చేశాడు. రోడ్డుపై వెళ్లే వాహ‌నాల‌ను అడ్డుకున్నాడు. నిందితుడు యూసుఫ్‌గూడ‌లో ఉంటూ సినిమాల్లో సెట్ల నిర్మాణానికి వెల్డింగ్ ప‌ని చేసుకుంటూ జీవిస్తున్నాడ‌ని పోలీసులు తేల్చారు. కాగా, ఈ దాడి వెనుక ఎటువంటి ఉద్దేశాలు, రాజ‌కీయ ప్రోద్భ‌లం లేద‌ని నిర్ధార‌ణ‌య్యింది.

Related News