హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎన్టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడి జరిగింది. మూడు ద్వీచక్ర వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఛానల్ కార్యాలయంపై రాళ్లు విసిరి పారిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు కార్యాలయంలో సుమారు 50 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరింతా ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో ఆందోళనకు లోనయ్యారు. రాళ్ల దాడిలో ఛానల్ కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఎన్టీవీ ఛానల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.