logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పద్యం తెచ్చిన తంటా.. జొన్నవిత్తులపై కేసు నమోదు

ప్రముఖ తెలుగు గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కరోనా సోషల్ డిస్టన్సింగ్ పై జొన్నవిత్తుల రాసిన పద్యం పై తీవ్ర దుమారమే రేగింది. దళిత కులాల వారిని కించపరిచే విధంగా తమ బ్రాహ్మణ కులమే గొప్పదని, తమ ఆచారాలే భారత సంస్కృతి అన్నట్టుగా అయన తన పద్యం లో రాసారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.

ఈ వివాదం పై అయన స్పందిస్తూ అంటరానితనాన్ని, దళితులను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, తాను కేవలం బ్రాహ్మణ కులాల్లో మడి కట్టుకునే సంప్రదాయాన్నే ఇప్పుడు ప్రపంచమంతా అవలంబిస్తోందని చెప్పానని అన్నారు. మడి అంటే ఒకరిని ఒకరు తగలేకపోవడం. ప్రపంచమంతా ఇప్పుడు మడి కట్టుకుని మరణశయ్యపై ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారన్నారు.

జొన్నవిత్తుల సోషల్ డిస్టెంసింగ్ పేరుతో మరోసారి వర్ణ వివక్షను ప్రేరేపించే విధంగా తన పద్యం రాసారని సోషల్ మీడియా వేదికగా దళిత, వెనకబడిన కులాలవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అవసరమైతే శిక్షించవచ్చని అయన తెలిపారు జొన్నవిత్తుల. ఈ మేరకు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ హైదరాబాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Related News