logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

ఉద్యోగం పోయిందా..? కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది..!

క‌రోనా ప్ర‌భావం, లాక్‌డౌన్ కార‌ణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు న‌డ‌వ‌క‌, కొన్ని వ్యాపారాలు ఇంకా తెరుచుకోక‌, మార్కెట్ సరిగ్గా లేక‌ ప్రైవేటు సంస్థ‌లు ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డానికి త‌మ ఉద్యోగుల సంఖ్య‌ను అమాంతం త‌గ్గిస్తున్నాయి. దీంతో గ‌త ఆరు నెల‌లుగా పెద్ద ఎత్తున చిరుద్యోగులు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోతున్నారు. ఈ స‌మ‌యంలో కొత్త ఉద్యోగాలు వెంట‌నే దొర‌క‌డం కూడా క‌ష్టంగా మారింది. ఇటువంటి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.

ఇలా ఉద్యోగం కోల్పోయిన ప్రైవేటు కార్మికులు, చిన్న ఉద్యోగస్తుల‌ను ఆదుకునేందుకు కేంద్రం ఒక ప‌థ‌కాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని అట‌ల్ బీమిత్ వ్య‌క్తి క‌ళ్యాణ్ యోజ‌న‌(ఏబీవీకేవై) అనే ప‌థ‌కం కింద కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటోంది. కొత్త ఉద్యోగం దొరికే వ‌ర‌కు గ‌రిష్ఠంగా మూడు నెల‌ల పాటు స‌గం జీతం చెల్లించాల‌ని కేంద్ర కార్మిక శాఖ ఒక మంచి నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌థ‌కం గురించి తెలుసుకుంటే చాలా మందికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ ప‌థ‌కం పొందాలంటే కొన్ని అర్హ‌త‌లు ఉండాలి. ముఖ్యంగా క‌నీసం రెండేళ్లుగా ఈఎస్ఐ చందాదారుడిగా ఉండాలి. ఈఎస్ఈ చందాదారులు కాని వారికి, ఎక్కువ వేత‌నాలు ఉండే ప్రైవేటు ఉద్యోగుల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు. ప్రైవేటు రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి, కార్మికుల‌కు లాక్‌డౌన్‌, క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఉద్యోగం కోల్పోతే నెల రోజుల త‌ర్వాత ఈ ప‌థ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వ సాయం పొందేందుకు అర్హ‌త ల‌భిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన వ్య‌క్తి ఆధార్ కార్డు వివ‌రాలు, బ్యాంకు ఖాతా వివ‌రాలు, ఈఎస్ఐ వివ‌రాల‌తో ఈ ప‌థ‌కానికి ఈఎస్ఐసీ వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోలేని వారు నేరుగా ద‌గ్గ‌ర్లోని ఈఎస్ఐ కార్యాల‌యానికి వెళ్లి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఉద్యోగంలో నుంచి తీసేసిన యాజ‌మాని లేదా కంపెనీ నుంచి ఎటువంటి దృవీక‌ర‌ణ కూడా అవ‌స‌రం లేకుండానే నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అప్పుడు ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించి ప‌థ‌కానికి అర్హ‌త ఉందా, లేదా అనేది గుర్తిస్తారు. రెండేళ్లుగా ఈఎస్ఐ చెల్లిస్తున్న వారే ఈ ప‌థ‌కానికి అర్హులు కాబ‌ట్టి, ఈఎస్ఐ వివ‌రాల ప్ర‌కారం గ‌త రెండేళ్లుగా ఆ వ్య‌క్తి నెల జీతం యావ‌రేజ్‌గా ఎంత ఉంద‌నేది చూస్తారు. దీనిని బ‌ట్టి నెల‌లో స‌గం జీతాన్ని సాయంగా ల‌బ్ధిదారుల‌కు అందిస్తారు. ఇలా మూడు నెల‌ల పాటు స‌గం జీతాన్ని కేంద్రం చెల్లిస్తుంది. డ‌బ్బులు కూడా బ్యాంక్‌లోకే వ‌చ్చేస్తాయి.

ఉద్యోగం కోల్పోయిన చిరుద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కునే వర‌కు ఇబ్బంది ప‌డ‌కుండా ఈ ప‌థ‌కాన్ని కేంద్ర కార్మిక శాఖ అమ‌లు చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన మార్చ్‌ 24వ తేదీ నుంచి రానున్న డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు ఇలా మూడు నెల‌ల పాటు 50 శాతం జీతాన్ని పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ డిసెంబ‌ర్ 31 త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 25 శాతం జీతం మాత్ర‌మే సాయంగా కేంద్రం అందిస్తుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు ఈఎస్ఐసీ వెబ్‌సైట్‌లో ప‌రిశీలించ‌వ‌చ్చు. ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది ప‌డుతున్న చిరుద్యోగుల‌కు, కార్మికుల‌కు ఇది నిజంగా ఆదుకునే ప‌థ‌కం. కాబ‌ట్టి, మీతో పాటు మీకు తెలిసిన వారికి కూడా ఈ ప‌థ‌కం కూడా తెలియ‌జేయండి.

Related News