చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో సీనియర్ ఆటగాడు అశ్విన్ రవిచంద్రన్ చెలరేగిపోయాడు. కీలక బ్యాట్స్ మ్యాన్ చేతులెత్తేసిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ సెంచరీతో చారిత్రక విజయాన్ని నమోదు చేసాడు. అంతే కాదు మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 5 వికెట్లు తీసుకుని సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. 134 బంతుల్లో 14x 4, 1x 6సహాయంతో సెంచరీ కొట్టాడు. టెస్టు కెరీర్లో అశ్విన్ కి ఇది ఐదో శతకం కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 83 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ప్రస్తుతం అశ్విన్(103), సిరాజ్(9) క్రీజులో ఉన్నారు. భారత్ 471 పరుగుల ఆధిక్యంలో ఉంది.