logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

ఎవ‌రీ మితుల్ ? ఐపీఎల్‌లో ఎవ‌రు గెలుస్తారో ముందే ఎలా చెబుతున్నాడు ?

ఈ మ‌ధ్య అభిజ్ఞ ఆనంద్ అనే ఓ పిల్ల‌వాడు చెప్పింది చెప్పిన‌ట్లు జ‌రుగుతోంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అంత‌కుముందు త‌మిళ‌నాడుకు చెందిన బాలాజీ హ‌స‌న్ అనే జ్యోతిష్యుడు చెప్పిన‌వి కూడా చాలా వ‌ర‌కు జ‌ర‌గ‌డంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కోవ‌లోకి వ‌చ్చాడు మితుల్ అనే ఓ కుర్ర‌వాడు. అయితే, మితుల్ మిగ‌తా జ్యోతిష్యుల్లా కాదు. త‌ను సీరియ‌స్‌గా జ్యోతిష్యం చెప్ప‌డు. స్వ‌తాహా క్రికెట్ ప్రేమికుడు. విరాట్ కోహ్లీకి వీరాభిమాని.

క్రికెట్‌ను ఆరాధిస్తుంటాడు. ఇప్పుడు ఐపీఎల్ ల‌వ‌ర్స్‌లో మితుల్ ఒక హాట్ టాపిక్‌గా మారాడు. ఎందుకంటే ఐపీఎల్ ఫ‌లితాల‌కు సంబంధించి మితుల్ చెప్పింది చెప్పిన‌ట్లుగా జ‌రుగుతోంది. ఆయ‌న ఎవ‌రు గెలుస్తార‌ని చెబితే వారే గెలుస్తున్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న ఐపీఎల్ ఫ‌లితాల‌ను ఎప్పుడో జులైలోనే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అప్పుడు మితుల్ చెప్పిన‌ట్లే ఇప్పుడు జ‌రుగుతుండ‌టంతో మితుల్ ట్వీట్ వైర‌ల్ అయ్యింది.

జులై 27న ఐపీఎల్ ప్రారంభం కాక‌ముందే మితుల్ ఒక ట్వీట్ చేశాడు. అందులో.. 1. కోహ్లీ ఐపీఎల్‌లో యావ‌రేజ్‌గా ఆడ‌తాడు, 2. చెన్నై ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్ల‌దు, 3. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చివ‌ర్లో ఉండిపోతుంది, 4. కింగ్స్ లెవ‌న్ పంజాబ్ ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌దు, 5. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సీజ‌న్ ఐపీఎల్ విజ‌త‌, 6. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ, ముంబై ఇండియ‌న్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి అని మొత్తం ఆరు చెప్పాడు మితుల్‌.

అప్పుడు ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో అంత‌గా ఫాలోయింగ్ లేదు. కాబ‌ట్టి, మితుల్ ట్వీట్ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు మితుల్ చెప్పిన‌ట్లుగానే ఐపీఎల్‌లో జ‌రుగుతోంది. మితుల్ చెప్పిన‌ట్లుగానే కోహ్లీ యావ‌రేజ్‌గా ఆడాడు. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌లేక‌పోయింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చివ‌ర్లో నిలిచింది. పంజాబ్ కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్ల‌లేదు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాయి.

ఇలా మితుల్ చెప్పిన ఆరింటిలో ఐదు ఇప్ప‌టికే జ‌రిగాయి. దీంతో ఒక్క‌సారిగా మితుల్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ అయ్యాడు. అంతేకాదు, తాను చేసిన అంచ‌నాల్లో నిజ‌మైన‌వి చెబుతూ తానే ఓ ట్వీట్ చేశాడు. ఇందులో మిగిలి ఉంది కేవ‌లం హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ విజేత‌గా నిల‌వ‌డమే. ఇది కూడా జ‌రిగితే మితుల్ ఈ సీజ‌న్ ఐపీఎల్ మొత్తం ఫ‌లితాల‌ను ముందే అంచ‌నా వేసి చెప్పేశాడ‌ని అనుకోవ‌చ్చు.

మితుల్ స్వ‌స్థ‌లం గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌. 26 ఏళ్ల ఈ కుర్రాడు ఇంత క‌రెక్ట్‌గా ఐపీఎల్ 2020 ఫ‌లితాలు ఎలా చెబుతున్నాడ‌నేది ఇప్పుడు ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అంతేకాదు, 2020 సంవ‌త్సరానికి సంబంధించి కూడా జ‌న‌వ‌రి 1వ తేదీనే మితుల్ ఒక ట్వీట్ చేశాడు. ఈ సంవ‌త్స‌రం అస్స‌లు బాగుంద‌ని, త్వ‌ర‌గా గ‌డిచిపోయి 2021 వ‌స్తే బాగుంటుంద‌ని మితుల్ ట్వీట్ చేశాడు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే 2020లో మ‌న‌మంతా ఎన్ని క‌ష్టాలు అనుభ‌విస్తున్నామో తెలిసిందే.

Related News